అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN, First Publish Date - 2023-04-03T23:32:51+05:30
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే బీఆర్‌ఎస్ లక్ష్యమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
- ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్
జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రాజాపూర్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే బీఆర్‌ఎస్ లక్ష్యమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమ వారం రాజాపూర్ మండల పరిధిలోని ముదిరెడ్డిప ల్లి గ్రామ శివారులో రెండవ రోజు నవాబ్‌పేట మం డల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో పని చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్థి పథకలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు. భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పే మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు. ఆ పార్టీలకు ఓటు వేస్తే చెత్తా బుట్టలో వేసినటేనన్నారు. జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గత ప్రభుత్వలు ప్రాజెక్టులను గాలికి వదిలేస్తే, తెలంగాణ ప్రభుత్వం వాటన్నింటిని పూర్తి చేసి ప్రతీ గ్రామానికి సాగు, తాగు నీరు అందిస్తోందన్నారు. కార్యకర్తలందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బీఆర్ ఎస్ రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన ఆత్మీయ సమేళనం సందేశాన్ని చదివి వినిపించా రు. మంగళవారం రాజాపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులతో ఆత్మీ య సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శ్వేత , బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సిములు, మార్కెట్‌చైర్మన్ లక్ష్మయ్య, మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్‌నాయక్, రాంప్రసాద్, లక్ష్మయ్య, నాగిరెడ్డి, శ్రీశైలం యాదవ్, నవాబ్‌పేట మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T23:32:51+05:30 IST