ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కల సాకారమైంది

ABN, First Publish Date - 2023-10-05T23:36:49+05:30

అలంపూర్‌ ప్రజల కల సాకారమైందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం అలంపూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాంతో కలిసి ప్రారంభించారు.

100 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 5 : అలంపూర్‌ ప్రజల కల సాకారమైందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం అలంపూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాంతో కలిసి ప్రారంభించారు. అలంపూర్‌ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి భవనాన్ని, అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఆనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో రోగపీడితులు ఉండరాదనే ఉద్దేశ్యంలో ఇప్పటికే పల్లెద వాఖానాలు, బస్తీదవాఖానాలు ఏర్పాటు చేశామని అన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అలంపూర్‌కు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేశారని అన్నారు. ఈ ప్రాంత వాసులకు ఇది గొప్ప ఆరోగ్యవసతి అని అన్నారు. ఇక్కడి ప్రజలు ఆనారోగ్యానికి గురై కర్నూల్‌ ఆసుపత్రులకు వెళ్తున్నా రని, అక్కడ సరైనవైద్యం అందడంలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే అబ్రహాం పలుమార్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. స్పందించిన సీఎం కేసీఆర్‌ అలంపూర్‌ ప్రజల కల సాకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం కొన్ని పరికరాలు వచ్చాయి. త్వరలోనే ఆవ సరమైన అన్ని పరికరాలు, సిబ్బందిని నియమిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో అలంపూర్‌ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. త్వరలో మల్లమ్మకుంట, జులేకల్‌, వల్లూరు రిజర్వాయర్లు పూర్తయితే అలంపూర్‌ మరో కోనసీమగా మారుతుందన్నారు. చల్లా హయాంలో మంజూరైన ర్యాలంపాడు బ్రిడ్జిని, బొంకూరు, కలుకుంట్ల వాగులపై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. తాను 22 ఏళ్లపాటు పూరిగుడిసెలు ఉన్న ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలందించానని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందాజగన్నాథం, అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహన్‌, పుల్లూరు సర్పంచు నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు సువర్ణమ్మ, ఎంపీపీ బీసమ్మ, జడ్పీటీసీ సభ్యులు రాములమ్మ, జనరల్‌ ఫిజీషీయన్‌ పరశురాం ఉన్నారు.

Updated Date - 2023-10-05T23:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising