ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతును రాజు చేయడమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-08-02T00:20:31+05:30

తెలంగాణలో ఉన్న రైతులను రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డిలు అన్నారు.

నీటిని విడుదల చేస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

దేవరకద్ర/మరికల్‌, ఆగస్టు 1 : తెలంగాణలో ఉన్న రైతులను రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డిలు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 26 అడుగులు నీరు ఉందని తెలిపారు. కుడి కాల్వ ద్వారా 100 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 75 క్యూసెక్కుల నీట్టి విడుదల చేసినట్లు వారు తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు కుడి, ఎడమ కాల్వలను పట్టించుకోక సాగునీరు వృథా చేశారని, సీఎం కేసీఆర్‌ సహకారంతో కాల్వను మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యలయం వద్ద 139 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమా, జడ్పీటీసీ సభ్యులు అన్నపూర్ణ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్‌, ఆధికారులు ఉన్నారు.

ప్రతీ ఎకరాకు నీరందిస్తాం

- సంగంబండ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిట్టెం

మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగాం గ్రామ సమీపంలోని సంగంబండ రిజర్వాయర్‌ కుడి హై లెవెల్‌ కెనాల్‌, లోలెవెల్‌ కెనాల్‌కు మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రాజెక్టులను నిర్మించారని తెలిపారు. రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందిచడం ద్వారా జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన రైతు కుటుంబాలు తిరిగి స్వగ్రామాల కు వచ్చి మంచి పంటలు పండించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు రైతుబీమా, రైతుబంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి, సర్పంచు అశోక్‌గౌడ్‌, మారుతి, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్డను సస్యశ్యామలం చేస్తాం

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

ధరూరు : సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతీ ఎకరానికి సాగునీరు అందించి నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్ద మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా లోని ధరూరు, గట్టు, అయిజ, మల్దకల్‌ మండలాలకు సాగునీరు అందిస్తున్నా మని చెప్పారు. గతేడాది జూరాల జలాశయం పూర్తిగా నిండటంతో, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపామని చెప్పారు. రిజర్వాయర్లు, కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. త్వరలో గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి రైతులకు నీరందించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీధర్‌ గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైఎస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, సర్పంచులు కర్రెమ్మ, మహబూబ్‌, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు ఈశ్వరయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్వారెడ్డి, శ్రీరాములు, భీమ్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2023-08-02T00:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising