ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సంబురాలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2023-05-31T23:26:40+05:30

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ జి. రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 31 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బుధవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం భవన సముదాయంలోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్‌ 2 నుంచి 22 వరకు ఉత్సవాలలో భాగంగా కొన్ని కార్య క్రమాలు జిల్లా కేంద్రంలో, నియోజకర్గ స్థాయిలో అలాగే గ్రామ స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. రైతు దినోత్సవం రోజు విషయాలను వివరించే విధంగా ఫ్లెక్సీలు డిస్ప్లేతో పాటు, సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మంచి నీళ్ల పండుగ రోజు గ్రామంలోని ప్రజలు ఎక్కువ మంది మిషన్‌ భగీరథ ఫిల్లర్‌ బెడ్స్‌ సందర్శించేలా అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయాలని మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు జిల్లా మం త్రులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్ర తినిధులను భాగస్వాములు చేయాలన్నారు. కార్యక్రమాలన్ని నూతనంగా ఏర్పాటు చేసిన శిల్పారామంలో నిర్వహించాలని అన్నారు. అన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రతీ రోజు నిర్వహించే అన్ని కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2023-05-31T23:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising