ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగం రాదని ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-26T22:55:44+05:30

ఉద్యోగం సాధించాలనే తపనతో ఇటీవల నిర్వహించిన పోలీసు రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాసిన ఓ యువకుడు తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటిక్యాల, జూన్‌ 26: ఉద్యోగం సాధించాలనే తపనతో ఇటీవల నిర్వహించిన పోలీసు రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాసిన ఓ యువకుడు తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల ఎస్‌ఐ గోకారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామానికి చెందిన వెంకటేష్‌(24) హైదరాబాదులో ఉంటూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల కోసం కోచింగ్‌ తీసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన మెయిన్‌ ఫలితాలు, ఈవెంట్స్‌ కలిపి 112 మార్కులు వచ్చాయి. వయస్సు కూడా తక్కువగా ఉండటంతో ఉద్యోగం రాదని బాధపడుతూ ఉండేవాడని వెంకటేష్‌ తండ్రి కాశన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం హైదరాబాదు నుంచి గ్రామానికి వచ్చిన వెంకటేష్‌ ఆదివారం శాంతినగర్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. గ్రామ సమీపంలోని తిరుమలయ్య గుట్ట దగ్గర పురుగుల మందు తాగి, వాంతులు చేసుకొని పడిపోయాడు. స్థానికులు గమనించి మృతుని సోదరుడు చంద్రశేఖర్‌కు తెలిపారు. కుటుంబీకులు అక్కడికి చేరుకొని వెంకటేష్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2023-06-26T22:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising