ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2023-06-26T23:35:17+05:30

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్ప టికప్పుడు పరిష్కరించేందుకుగాను జిల్లా అధికారులు ప్రత్యేక ంగా దృష్టి పెట్టాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ సూచించారు.

ప్రజావాణిలో వినతులు స్వీకరించి, మాట్లాడుతున్న కలెక్టర్‌ జి. రవి నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ రవినాయక్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జూన్‌ 26 : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్ప టికప్పుడు పరిష్కరించేందుకుగాను జిల్లా అధికారులు ప్రత్యేక ంగా దృష్టి పెట్టాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ సూచించారు. పాలనాపరమైన కారణాల వల్ల మూడు వారాలుగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఫిర్యాదు దారులు అధిక సంఖ్యలో వచ్చి వివిధ అంశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూములకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర అంశాలకు సంబంధించి మండల స్థాయి లో పరిష్కారం అయ్యే ఫిర్యాదులపై సంబంధిత మండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా అధికారులకు సంబం ధించిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా జిల్లా అధికారిని తనవద్దకు పిలిపించుకొని ప్రజలు సమర్పించిన ఫిర్యాదులపై తక్షణం చర్య తీసుకోవాలని, ఈ విష యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశాలు జారీ చేస్తూ పలు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్‌డీవో యాదయ్య, ప్రత్యేక కలెక్టర్‌ పద్మశ్రీతో పాటు, జిల్లా అధికారులు హాజరై వినతులను స్వీకరించారు.

ప్రాధాన్యత పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలి

పురోగతిలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను త్వరిగతిన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్‌ జి. రవినాయక్‌ జిల్లా అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారు లను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవ న సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా అధికారులను కలెక్టర్‌ అభినందించారు. ఉత్సవాలు పూర్తి చేసిన స్పూర్తితో జిల్లా అధికారులందరు రెగ్యులర్‌ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం దళిత బంధు, బీసీ ఆర్థిక సహాయం కార్యక్రమం, గ్రూప్‌-4 పరీక్షల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, అధికారులతో సమీక్షించారు.

నిరాహారదీక్ష చేపట్టిన స్కూల్‌ స్వీపర్లు

సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం

- నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన స్కూల్‌ స్వీపర్లు

పాలమూరు/ మహబూబ్‌నగ్‌ టౌన్‌, జూన్‌ 26 : నెలకు అతితక్కువ వేతనం రూ.1623లతో ఎవరైన పనిచేస్తున్నారంటే అది కేవలం స్కూల్‌ స్వీపర్లు మాత్రమేని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్‌, స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.గట్టన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో స్కూల్‌స్వీపర్లు నిరవదిక నిరాహారదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్కూల్‌ స్వీపర్లచేత తెలంగాణ ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిం చుకుంటోందన్నారు. స్వీపర్లకు నెలకు రూ.27వేలు ఇవ్వాలని, పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్లందరిని బేషరతుగా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాలగౌడ్‌, చండ్రాయుడు, ముర్తూజా, మణ్యం, జయమ్మ, వెంకటమ్మ, శోభ, రాణి, ఆంజనేయులు, రత్న మాల, వెంకటయ్యగౌడ్‌, నరసింహా, యాదగిరి గౌడ్‌, బందన్న, సాధిక్‌, అంజి, రాములు, మోహన్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లాలోని స్వీపర్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising