సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
ABN, First Publish Date - 2023-09-22T23:04:36+05:30
రానున్న ఎన్నికల దృష్ట్యా నారాయణపేట, మద్దూర్ మండ లాల్లోని సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రా లను శుక్రవారం ఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి, పరిశీలించారు.
- ఎస్పీ వెంకటేశ్వర్లు
- పోలింగ్ బూత్‌ల పరిశీలన
నారాయణపేట, సెప్టెంబరు 22 : రానున్న ఎన్నికల దృష్ట్యా నారాయణపేట, మద్దూర్ మండ లాల్లోని సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రా లను శుక్రవారం ఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి, పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల వద్ద మరుగు దొడ్లు, ప్రహరీ, విద్యుత్, మంచినీరు తదితర ముందస్తు అవసరాలను పరిశీలించారు. లేనిచోట్ల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాట్లు చేయా లని రెవెన్యూ, గ్రామ అధికారులకు ఎస్పీ సూచిం చారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల సమ యంలో సీఆర్పీఎఫ్ బలగాలను బందోబస్తుకు ఉంచుతామని, ఇంతకుముందు ఎన్నికల్లో గొడ వలు సృష్టించిన వారిపై బైండోవర్ చేయాలని ఎస్పీ పోలీసులకు సూచించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించినా, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ హెచ్చరించారు. గ్రామాల్లో కలిసిమె లిసి శాంతియుతంగా ఉండాలని ప్రజలను కోరా రు. ఎస్పీ వెంట సీఐలు రవి, శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్, ఎస్సై జయప్రసాద్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
బాంబ్‌స్క్వాడ్ తనిఖీ..
వినాయకచవితి, మిలాద్‌ఉన్‌నబీ పండుగల దృష్ట్యా ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శుక్ర వారం బ్యాండ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు వి నాయక మండపాలు, మస్జీద్‌లు, ప్రార్థన మంది రాల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు కన్పిస్తే డయల్ 100కు సమాచా రం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు.
Updated Date - 2023-09-22T23:04:36+05:30 IST