ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సోషల్‌ మీడియా విప్లవం

ABN, First Publish Date - 2023-08-02T00:14:25+05:30

సమాచార పంపిణీలో సోషల్‌ మీడియా ఒక విప్లవమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ అన్ని స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులకు నిర్వ హించిన సోషల్‌ మీడియా శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- ఉత్తరాలు, ల్యాండ్‌ లైన్‌ ఫోన్లకు కాలం చెల్లింది

- విషయాల చేరివేతలో ఆధునికత చోటు చేసుకున్నది

- పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌, ఆగస్టు 1: సమాచార పంపిణీలో సోషల్‌ మీడియా ఒక విప్లవమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ అన్ని స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులకు నిర్వ హించిన సోషల్‌ మీడియా శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ప్రచారం లో ఒకప్పుడు గోడ రాతలు, బ్యానర్లు, చిన్న జీపులదే గొప్ప ప్రచారం అన్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో సంపూర్ణంగా పరిస్థితి మారిపోయిందన్నా రు. ప్రజలకు ఏమీ తెలియ దు అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరూ ఉండరని, ఒకప్పటి దూరదర్శన్‌ స్థానంలో వందల న్యూస్‌ ఛానళ్లు వచ్చాయన్నారు. మారిన వార్తా ప్రపంచంలో సోష ల్‌ మీడియాదే అగ్రస్థానం అని, ఈ పేపర్‌లకు ఆదరణ పెరుగుతున్నదన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పు కుంటేనే ప్రజలు ఆశీస్సులు అందిస్తారన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం అన్నారు. రాష్ట్రంలోని మిగతా నియోజక వర్గాలకు భిన్నంగా పెబ్బేరులో మత్స్య కళాశాల, వే సైడ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేశాం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 64 మినీ లిఫ్టులు ఏర్పాటు చేశామని, వనపర్తికి జేఎన్‌టీయూ ప్రభుత్వ ఇంజనీ రింగ్‌ కళాశాల, వ్యవసాయ డిగ్రీ కళాశాల సాధించుకున్నామని తెలిపారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా వనపర్తి అభివృద్ధి కోసం కృషి చేశానని, నా పనిని గుర్తించి 2018 ఎన్నికలలో ప్రజ లు అత్యధిక మెజార్టీతో గెలిపిం చారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడుు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌చైర్మన్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, జిల్లా శిక్షణ తరగతుల చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, నియోజ కవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, సో షల్‌ మీడియా శిక్షకులు సత్య ప్రసాద్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-02T00:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising