ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-04-03T23:34:43+05:30
ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరి ష్కరించాలని కలెక్టర్ జి. రవినాయక్ ఆదేశించారు.
మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 3 : ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరి ష్కరించాలని కలెక్టర్ జి. రవినాయక్ ఆదేశించారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతీ వినతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను పిలిపించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతా ల నుంచి వ్యయప్రయాసాలకు ఒర్చి సమస్యలతో బాధి తులు వస్తుంటారని వారి వినతులు వెంటనే పరిష్కరిం చాలని సూచించారు. అవసరం అయితే మండలాల అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వచ్చిన వినతులు మళ్లీ రాకుండా చూడాలని కోరారు. భూముల సర్వేకి సంబం ధించిన దరఖాస్తులు, భూములకు సంబంధించిన దరఖాస్తుతో పాటు మునిసి పాలిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామా రావు, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, ఆర్డీవో అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళిక తయారు చేయాలి
మహబూబ్‌నగర్ టౌన్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద వచ్చే సంవత్సరం నాటనున్న మొక్కలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వెం టనే తయారు చేయాలని కలెక్టర్ జి. రవినాయక్ కోరారు. సోమవారం సమీకృ త జిల్లా అధికారుల కార్యాలయం భవన సముదాయంలోని సమావేశమందిరం లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైకుంఠధా మాలలో విద్యుత్, నీటి కనెక్షన్లు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పదవత రగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇన్విజిలేటర్లతో సహా అందరికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండా లని అన్నారు. ఈ- ఆఫీసులో పెండింగ్ ఫైళ్లను ఆయా కార్యాలయాల వారి నివే దిక తయారు చేసి క్లోజ్ చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T23:34:43+05:30 IST