ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు
ABN, First Publish Date - 2023-05-15T23:33:31+05:30
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అధికారుల ను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్
- ‘ప్రజావాణి’కి 46 ఫిర్యాదులు
గద్వాల క్రైం, మే 15 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అధికారుల ను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలపై అత్యధికంగా 39 ఫిర్యాదులు వచ్చాయి. ఆసరా పింఛన్లకు సంబంధించి మూడు, ఇతర సమ స్యలపై నాలుగు ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి, వారి పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన ఽఫిర్యాదులను పరిశీలించి, తహసీల్దార్లతో మా ట్లాడి పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్డీవోరాములు, ఏవో యాదగిరి, సూపరింటెండెంట్ రాజు, మదన్‌మోహన్ పాల్గొన్నారు.
పింఛన్ వచ్చేలా చూడండి సారూ..
పింఛన్ వచ్చేలా చూడండి సారూ.. అంటూ పలువురు దివ్యాంగులు అధికారులను వేడుకున్నారు. సదరం సర్టిఫికెట్ వచ్చేలా చూడాలని కొందరు, ఆన్‌లైన్లో తమ పేర్లు నమోదు కావడంలేదని మరి కొందరు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం ‘ప్రజా వాణి’లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కొందరు దివ్యాంగులను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించి వివరాలు తెలుసుకున్నది. పింఛన్ కోసం కలెక్టరేట్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని మానవపాడు మండలం పెద్ద ఆముదాలపాడు చెందిన మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల పట్టణ పరిధిలోని జమ్మిచేడుకు చెందిన షేక్ హుస్సేన్ కూడా పింఛన్ మంజూరు కోసం కలెక్టరేట్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ కావడం లేదని ఉండవల్లి మండలం చెన్నిపాడుకు చెందిన బి.వెంకటలక్ష్మి, చెన్నిపాడుకు చెందిన గోవర్ధన్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-05-15T23:34:50+05:30 IST