ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ప్రైవేటు’ దోపిడీ

ABN, First Publish Date - 2023-06-15T23:52:57+05:30

తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైన ఖర్చు చేస్తారన్న బలహీనతను ప్రైవేట్‌ పాఠశాల యజమాను లు ఆసరాగా తీసుకుంటున్నారు. ఫీజులు ఎంత పెంచి నా అడిగేవారుండరని ఇష్టారీతిగా పెంచుతున్నారు. పాఠశాలలో టెక్నో, ఈ బ్యాచ్‌, ఐపీఎల్‌, ఎంబ్యాచ్‌ అనే బ్యాచ్‌లతో విద్యార్థుల తల్లిదండ్రులకు గారడీ చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు

బడుల్లోనే యూనిఫామ్స్‌, నోట్‌, పాఠ్యపుస్తకాల విక్రయాలు

ఉమ్మడి జిల్లాలో 1,028కి పైగా బడులు

ఫీజులను నియత్రించాలని డిమాండ్‌ చేస్తున్న విద్యార్థి సంఘాలు

పట్టించుకోని అధికారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 15: తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైన ఖర్చు చేస్తారన్న బలహీనతను ప్రైవేట్‌ పాఠశాల యజమాను లు ఆసరాగా తీసుకుంటున్నారు. ఫీజులు ఎంత పెంచి నా అడిగేవారుండరని ఇష్టారీతిగా పెంచుతున్నారు. పాఠశాలలో టెక్నో, ఈ బ్యాచ్‌, ఐపీఎల్‌, ఎంబ్యాచ్‌ అనే బ్యాచ్‌లతో విద్యార్థుల తల్లిదండ్రులకు గారడీ చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తమ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నాయని, రంగు రంగుల కర పత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ప్రైవేట్‌ పాఠశాలలో 30 నుంచి 40శాతం ఫీజులు పెంచుతున్నా రు. దీనికి తోడు విద్యార్థుల యూనిఫామ్స్‌, పుస్తకాలు అయా పాఠశాలలకు అనుబంధంగా కొన్నిషాపుల యజ మానులతో బేరం కుదుర్చుకుంటున్నారు. తమ పాఠశా లలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడా లభించవని, తాము చూపించిన దుకాణంలోనే దొరుకుతాయని విద్యా ర్థుల తల్లిదండ్రులకు చెప్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,028 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. పాఠ శాలలు జూన్‌ 12 నుంచి పునఃప్రారంభించినా విద్యార్థు ల చేరికలు మాత్రం మే చివరి నుంచే ప్రారంభించారు. వి ద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500, అడ్మిషన్‌ టెస్టు ఫీజు రూ.500, అడ్మిషన్‌ ఫీజు అన్ని తరగతుల వారికి రూ. 5వేల నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తు న్నారు. తరగతిని బట్టి ట్యూషన్‌ ఫీజు నిర్ణయించారు. యూకేజీకి రూ. 25 వేలు, పదో తరగతికి రూ 58 వేల వరకు నిర్ణయించారు. కొన్ని పెద్ద పాఠశాలల్లో అయితే మరో 25 శాతం నుంచి 40 శాతం వరకు పెంచారు.

దీనికి తోడు స్కూల్‌ యూనిఫామ్స్‌, షూ, టై బైల్ట్‌కు రూ.6 వేల నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేస్తు న్నారు. బస్సు ఫీజు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజు లెక్కలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల గుండె గుబేల్‌ మంటోంది. కానీ పిల్లల భవిషత్తు కోసం ఎంత ఖర్చు అయినా మంచి పాఠశాలల్లో చేర్పించాలన్న నిర్ణయం తీసుకొని ఒక్కో పిల్లాడిపై సూమారు రూ. 55 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. హాస్టల్‌ సౌకర్యం ఉంటే ఒక్కొ విద్యార్థికి రూ.1.5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

అధికారుల పర్యవేక్షణ కరువు

విద్యాశాఖ అధికారులు ప్రైవేట్‌ పాఠశాలలను పట్టిం చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయు. ఫీజుల ని యంత్రణ కమిటీ, పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేయ డంలేదు. పరిమితికి మించి ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నా పట్టించుకోవడం లేదు, ఒక్క పాఠశాలకు గుర్తింపు ఉంటే చాలు రెండు మూడు బ్రాంచ్‌లను ఆదే పేరుమీద నడుపుతున్నారు. ఇంత జరుగు తున్నా విద్యాశాఖ అధికారులు కొందరు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు ఆశపడి వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ పాఠశాల యాజమాన్యం ఒకే బ్రాంచ్‌కు అనుమతులు తీసుకొని రెండు బ్రాంచ్‌లను నడిపిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గోదాంను సీజ్‌ చేసినా విద్యాశాఖ అధికారికి ముడుపు లు ఇచ్చి యథావిధిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో ఫీజుల వివరాల కోసం దిడ్డికాడి గోపాల్‌ అనేవ్యక్తి సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలైనా నేటికీ సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన కోర్టును కూడా అశ్రయించినట్లు తెలిసింది.

Updated Date - 2023-06-15T23:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising