ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN, First Publish Date - 2023-09-04T22:33:00+05:30

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

కృష్ణలో తహసీల్దార్‌ అమీర్‌కు వినతిపత్రం ఇస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

మరికల్‌/కృష్ణ/దామరగిద్ద, సెప్టెంబరు 4 : పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వెంకటయ్య, అధ్యక్షురాలు తిరుపతమ్మ మాట్లాడారు. గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వేతనం చెల్లించాలని, ప్రభుత్వం జారీ చేసిన కొత్త మెనూకు సంబంధించి బడ్జెట్‌ కేటాయించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ సునీతకు వినతిపత్రం అందించారు. మధ్యాహ్నా భోజనం యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, అనిత, వెంకటేష్‌, సాయమ్మ, సత్యమ్మ పాల్గొన్నారు. కృష్ణ మండల కేంద్రంలో తహసీల్దార్‌ అమీర్‌కు వినతిపత్రం అందించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు గంగమ్మ, శంకరమ్మ, సారా, ఉమ, నర్మద, అనంతమ్మ, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T22:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising