ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొలువుదీరిన ఆలయ పాలకవర్గం

ABN, First Publish Date - 2023-09-21T23:38:10+05:30

నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జములమ్మ ఆలయ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరింది.

అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకవర్గం సభ్యులు

- జములమ్మ సన్నిధిలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

- చైర్‌పర్సన్‌గా కుర్వ గాయత్రి

గద్వాల, సెప్టెంబరు 21 : నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జములమ్మ ఆలయ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరింది. సభ్యులుగా ఎంపికైన కుర్వ గాయత్రి, గుండ్రాతి సంధ్య, పార్వతమ్మ, జయమ్మ, టి.సంధ్య, మహేశ్వరి, భవాని, సునీత, బొంగరి శారద, ఓంప్రకాశ్‌ కాంమ్లే, నాగరాజు, బంగి ధనియాలు, మంగలి జమ్మన్న, ఎక్స్‌ అపిషియో సభ్యుడు పూజారి రాజులతో ఈవో పురేందర్‌కుమార్‌, ఎండోమెంటు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరమ్మలు ప్రమాణ స్వీకారం చేయిం చారు. అనంతరం సభ్యులు కుర్వ గాయత్రిని చైర్‌ పర్సన్‌గా ప్రతిపాదించి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికా రులు చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ఘనంగా సత్కరిం చారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడారు. జములమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని అన్నారు. భక్తుల విడిది కోసం మత్స్యశాఖ వారి ఐదు ఎకరాల స్థలాన్ని ఆలయానికి కేటాయించాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని, అందరం కలిసి దాన్ని సాధించుకుందామని సూచించారు. అష్టాదశ విగ్రహాల స్థాపన పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఈవో పురేందర్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఒక ఆలయానికి 13 మంది సభ్యులలో తొమ్మిది మంది మహిళలను నియమించడం మొదటి సారని గుర్తుచేశారు. నూతన చైర్‌పర్సన్‌కు మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఆలయ మాజీ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌, మాజీ సభ్యుడు మేడికొండ జానకిరాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising