వాహన బకాయిలపై నజర్
ABN, First Publish Date - 2023-03-05T23:25:17+05:30
జిల్లాలో వాహ నాల బకాయి చెల్లింపులో జాప్యం చేస్తే రెట్టింపు జరిమానా విధించనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ఎర్రిస్వామి ఆదివారం తెలిపారు.
- పెండింగ్ ఉంటే రెట్టింపు జరిమానా
- జిల్లాలో 5,949 వాహనాలకు రూ.50కోట్లకు పైగా మొండి బకాయిలు
నాగర్‌కర్నూల్ క్రైం, మార్చి 5 : జిల్లాలో వాహ నాల బకాయి చెల్లింపులో జాప్యం చేస్తే రెట్టింపు జరిమానా విధించనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ఎర్రిస్వామి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20మండలాల్లో 5,949వాహనాలకు గాను రూ.50కోట్లకు పైగా బకాయిలున్నట్లు ఆయన పేర్కొన్నారు. జరిమానా వసూలు చేసేం దుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రత్యేక తనిఖీ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో జరిమానా ఉన్న వాహనాలు పట్టుబ డితే 200శాతం జరిమానా విధించనున్నట్లు తెలి పారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో లక్షా 20వేల 548వాహనాలు ఉండగా, అందులో ద్విచక్ర వాహ నాలు 75వేల 18, కార్లు 7,857, సరుకు రవాణా వాహనాలు 1,149, ఆటో రిక్షాలు 4,733, వ్యవ సాయ రంగానికి ఉపయోగించే ట్రాక్టర్లు 7,155, వాణిజ్య రంగానికి ఉపయోగపడే ట్రాక్టర్లు 5,447, స్కూల్ బస్సులు 306 ఉన్నట్లు ఎర్రిస్వామి పేర్కొ న్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాల యాజ మానులు రవాణా వాహనాలకు సంబంధించిన పన్నులు చెల్లించకుండా రోడ్లపై తిప్పుతూ ప్రభు త్వ ఖజానాకు రూ.50కోట్లు గండి కొడుతున్నారని తెలిపారు. వాటిలో అధికంగా 1,048లారీలు, ట్రా లీలు, స్కూల్ బస్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. 1,293 ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నప్పటికీ ప న్నులు చెల్లించకుండా వాహనదారులు రోడ్డు రవాణా నిబంధనలు ఉల్లంఘించి యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొన్నినెలలుగా స్పెషల్ డ్రైవ్‌లో వంద వాహనా లను సీజ్ చేసి రూ.30లక్షలు వాహనదారుల నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పా రు. 5,949మంది వాహనదారులు రూ.50కోట్లకు పైగా జరిమానాల మొండి బకాయిలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఆయన తెలిపారు. వాహనాల వారీతా ట్యాక్స్ పెండింగ్ జాబితాను జిల్లా అధికారులు రూపొందించినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం జరిమానాలు రెట్టింపు వసూలు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. వాహనదారులు తమకు తాము ట్యాక్స్ నేరుగా కడితే వారికి అదనపు డబ్బులు జరిమానా పడ కుండా ఉంటుందని చెప్పారు.
మండలాల వారీగా పన్ను చెల్లింపు వాహనదారుల వివరాలు..
జిల్లాలో నాగర్‌కర్నూల్‌లో 658, కల్వకుర్తిలో 553, అచ్చంపేటలో 463, అమ్రాబాద్‌లో 200, బల్మూరులో 211, బిజినేపల్లిలో 491, చారకొండలో 260, కోడేరులో 253, కొల్లాపూర్‌లో 303, లిం గాలలో 186, పదరలో 49, పెద్దకొత్తపల్లిలో 371, పెంట్లవెల్లిలో 92, తాడూరులో 312, తెలకపల్లిలో 269, తిమ్మాజిపేటలో 332, ఉప్పునుంతలలో 241, ఊర్కొండలో 141, వంగూరులో 300, వెల్దండలో 260, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలో ఉంటున్న నాలుగు వాహనాలతో పాటు మొత్తం 5,949 వా హనదారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2023-03-05T23:25:17+05:30 IST