ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలపై సభ్యుల గళం

ABN, First Publish Date - 2023-06-26T23:33:33+05:30

పాలమూరు పురపాలిక పరిధిలో సమస్యల పై కౌన్సిల్‌ సభ్యులు గళమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశా రు.

మాట్లాడుతున్న పురచైర్మన్‌ కోరమోని నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ బఫర్‌జోన్‌ అన్యాక్రాంతంపై పెదవివిరుపు

ఫ కుక్కల బెడదతో బేజారు

ఫ కొత్తకాలనీలకు భగీరథ నీళ్లివ్వండి : సభ్యులు

ఫ పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతోంది : మునిసిపల్‌ చైర్మన్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 26 : పాలమూరు పురపాలిక పరిధిలో సమస్యల పై కౌన్సిల్‌ సభ్యులు గళమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశా రు. అధికారులు స్పందించడం లేదని, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, బఫర్‌ జోన్‌లు అన్యాక్రాంతమవుతున్నాయని పలువురు సభ్యులు వాపోయా రు. సోమవారం మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు అధ్యక్షతన ము నిసిపల్‌ సమావేశ మందిరంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. బీజేపీ సభ్యులు అంజయ్య మాట్లాడుతూ పట్టణంలోని బఫర్‌జోన్‌లు అన్యాక్రాంతం అవుతున్నాయని, చెరువులు, నాలాల వెంబడి అక్రమ నిర్మాణాలు వెలుస్తు న్నాయని వాపోయారు. మరో బీజేపీ సభ్యుడు రామాంజనేయులు మాట్లాడు తూ అప్పన్నపల్లి పరిధిలోని శ్రీరాంనగర్‌కాలనీ, బృందావన్‌కాలనీ, శాంతినగర్‌ లకు నీటిసరఫరా ఇబ్బంది ఉందని, మూడు వార్డులకు ఒకటే వాటర్‌ ట్యాంక్‌ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందని, మరో ట్యాంక్‌ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా అప్పన్నపల్లి బ్రిడ్జీ పక్కన సర్వీస్‌ రోడ్ల వెంబడి విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ స్వప్న మాట్లాడు తూ పట్టణంలో కుక్కల నివారణకు కుటుంబ ఆపరేషన్‌లు చేయడానికి రూ.22 లక్షలు వెచ్చించారని, అయినా కుక్కల బెడద తీవ్రంగా ఉందని విచా రం వెలిబుచ్చారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అనంతరెడ్డి మాట్లాడుతూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరు సరిగా లేదని వాపోయారు. తాము ఎక్కడైనా కంప్లైంట్‌ చేస్తే అధికారులు అక్కడికి వెళుతున్నారే తప్ప చర్యలు లేవన్నారు. కుక్కల బెడద ఎక్కువైయిందని, వాటిని నియంత్రించాలని కోరారు. మరో కౌ న్సిలర్‌ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ పోస్ట్‌మార్టం ప్రాంతంలో పారిశధ్య నిర్వహ ణ సరిగా లేదని, ట్రాక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేయాలన్నారు. బక్రీద్‌ పండగ వస్తున్నందున పారిశుధ్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పాలమూరు అన్నిరంగాలలో అభివృద్ధి : మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ

పాలమూరు పురపాలిక అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు అన్నారు. ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృషి వల్ల ఎన్నడూ లేని విధంగా నిధులు వస్తున్నాయని, అన్ని వార్డుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు సాగుతున్నాయన్నారు. కౌన్సిల్‌ సభ్యులు సూచించిన అన్ని పనులు చేపడతామని, సమస్యలు పరిష్కరిస్తామ న్నారు. జంక్షన్ల సుందరీకరణ, శిల్పారామం ఏర్పాటు, మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్ధితో పాటు ఇంకా ఈ కౌన్సిల్‌ హయాంలో చాలా పనులు జరగనున్నా యని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ తాటిగణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising