ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో మార్కండేయస్వామి జయంతి

ABN, First Publish Date - 2023-01-24T23:59:00+05:30

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని మార్కెండేయ ఆలయంలో మంగళవారం భక్త మార్కెండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గద్వాల గాంధీ చౌక్‌లో కోలాటం ఆడుతున్న పద్మశాలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల టౌన్‌, జనవరి 24 : పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని మార్కెండేయ ఆలయంలో మంగళవారం భక్త మార్కెండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు నామాల శ్రీకాంత్‌ ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులతో పట్టణంలో రథోత్సవం నిర్వహించారు. భక్తులు, మహిళలు సంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి రథోత్సవంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. అనంతరం స్వామివారి డోలారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో పద్మశాలి సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్‌, కౌన్సిలర్‌ శ్రీమన్నారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు తిరుమల త్యాగరాజు, కోట నరసింహులు, మ్యాడం రామకృష్ణ, పగుడాకుల నారాయణ పాల్గొన్నారు.

రాజోలి : భక్తమార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు అడివిస్వామి, పద్మశాలి సంఘం సభ్యులు తాయప్ప, తిక్కయ్య, మార్కండేయులు, మధు, వీరేష్‌, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising