ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యా విధానంలో పలు మార్పులు

ABN, First Publish Date - 2023-06-20T23:26:25+05:30

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా విధానంలో సమూల మార్పులు చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మహబూబ్‌నగర్‌లో ప్రధానోపాధ్యాయులకు ట్యాబ్‌లను అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రతీ ఒక్కరు చదువుకోవాలి..

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 20 : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా విధానంలో సమూల మార్పులు చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో విద్యా దినో త్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువు కునే విధంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొ న్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ రవినాయక్‌లు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్‌లను, యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్కులు అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఎంఈవోలను, హెచ్‌ఎంలను, ఉపాధ్యాయులను, మం చి ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి అభినం దించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ నర్సిములు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కొడిగల్‌ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ స్థాయిలో గురుకులాలు..

- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానం తోనే రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి గురుకుల పాఠశా లలు నెలకొల్పడం జరిగిందని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నా రు. జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో మంగళ వారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగిం చారు. అనంతరం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న రెండో తరగతి చిన్నారి శ్రీభా వన చేసిన ప్రసంగం ఎమ్మెల్యేతో పాటు, ఆహుతుల ను ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ వాల్యానాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌యాదయ్య, జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీ, బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోవర్దన్‌రెడ్డి, బాదే పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, జడ్పీ సీఈవో జ్యోతి, ఎంఈవో మంజులాదేవి, ముడా డైరెక్టర్లు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నా రు. అంతకుముందు పట్టణంలోని రాఘవేంద్ర కాల నీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి సుమారు 40 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

కల్లేపల్లిలో...

రాజాపూర్‌ : మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంత రం మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.17.40 లక్షలతో ఏర్పాటుచేసిన తరగతి గదులను, డిజిటల్‌ తరగతి గదులను, బెంచీలను, మూత్రశాలలను, నీటి వసతులను పరిశీలించి, తరగతి గదులను ప్రారం భించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ సభ్యుడు మోహన్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ బాలమణి, బచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భామిణి, తహసీల్దార్‌ రాం బాయి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అదేవిధంగా, మండల కేంద్రంలోని స్థానిక ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో విద్యా దినోత్సవం సందర్భంగా టీటీడీ బోర్డు మెంబరు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌ రెడ్డి సమకూర్చిన క్రీడా సామగ్రిని ఎంజేఆర్‌ యువ సేన అధ్యక్షుడు మిల్క్‌ నర్సింములు విద్యార్థులకు అం దించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాల హెచ్‌ఎం ఆ నంద్‌కుమార్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యా రంగానికి కట్టుబడి ఉన్నాం..

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌ : విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం భూత్పూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పా టుచేసిన విద్యా దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు ఎంపీపీ కదిరే శేఖర్‌రెడ్డి తన సొంత ఖర్చులు రూ.10 లక్షల వ్యయంతో తీసుకొచ్చిన నోటు పుస్తకాలను ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వ రాజుగౌడ్‌, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్య క్షుడు సత్యనారాయణ, సింగిల్‌ విండో అద్యక్షుడు అశో క్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేష్‌కుమార్‌గౌడ్‌, నాయకులు, జీహెచ్‌ఎం సంగీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గురుకొండలో...

దేవరకద్ర : మండల పరిధిలోని గురుకొండ గ్రా మంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భా గంగా రూ.72 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశా లను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ రమ, జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, నాయకులు గోపాల్‌, రంగయ్య, సర్పంచ్‌ ఉషన్న తదితరులు పాల్గొన్నారు.

బండర్‌పల్లిలో...

చిన్నచింతకుంట : మండలంలోని బండర్‌పల్లి గ్రా మంలో నిర్వహించిన విద్యా దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక, జడ్పీహెచ్‌ఎస్‌లలో నిర్మించిన అదనపు గదులను వారు ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్ర మంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు వట్టెం రాజేశ్వరి, గ్రామ సర్పంచ్‌ సతీష్‌కుమార్‌, సింగి ల్‌ విండో చైర్మన్లు సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో లక్ష్మన్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట రాము, వట్టెం రాము, సురేందర్‌నాయక్‌తో పా టు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీ టీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

- కోయిలకొండ : మండలంలోని అన్ని పాఠశా లల్లో మంగళవారం విద్యా దినోత్సవాన్ని జరుపుకు న్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో 8,9,10వ తరగతులకు డిజిటల్‌ బోధన విధానాన్ని ఎంపీపీ శశికళ, జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌ రెడ్డిలు ప్రారంభించారు. అలాగే, ప్రాథమికోన్నత పాఠ శాలలో, హాస్టళ్లలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్త కాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణయ్య, వార్డు మెంబర్‌ ఆంజనేయులు, నాయకులు భీంరెడ్డి, లక్ష్మీనారాయణ, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- మహమ్మదాబాద్‌ : మండలంలోని దేశా యపల్లి ప్రభుత్వ పాఠశాలలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించారు. విద్యా దినోత్సవంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, సర్పంచ్‌ రఘు పాల్గొ న్నారు. అదేవిధంగా, మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. గాదిర్యాల్‌ గ్రామంలో సర్పంచ్‌ పెరికిటి వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కోట్ల రాములమ్మ, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, హెచ్‌ఎం సువ ర్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులతో అక్షరాభ్యాసం చే యించి, స్వీట్లు పంచారు.

- బాలానగర్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో మంగళశారం ఘనంగా విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పలువురు నాయకులు పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాల గురించి వివరించారు.

- మిడ్జిల్‌ : విద్యా దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో జీహెచ్‌ఎం రవికుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ఆయా గ్రామాల్లోని విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పలు సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యు రాలు శశిరేఖ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ రాధిక, ఎంపీటీసీ సభ్యుడు గౌస్‌, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-20T23:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising