‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2023-02-21T23:23:11+05:30
కంటి వెలుగు శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవా లని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్‌బాబు
- నాగర్‌కర్నూల్ సబ్ జైల్లో
కంటివెలుగు శిబిరం ప్రారంభం
కందనూలు, ఫిబ్రవరి 21 : కంటి వెలుగు శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవా లని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని నాగర్‌కర్నూల్ సబ్ జైల్లో కంటి వెలుగు శి బిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి డి.రాజేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో అందరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ఈ కంటి వెలుగు శి బిరంలో సబ్ జైల్లోని 17మంది ఖైదీలతో పాటు, ముగ్గురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అందరం పరీక్షించుకొని కంటి అద్దాలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా జడ్జి కారాగారంలో సందర్శించి ఖైదీల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఖైదీలకు కావాల్సిన అన్ని వసతు లు అందుబాటులో ఉంచాలని జైలు అధికారుల కు సూచించారు. ఖైదీలు తమకు కావాల్సిన న్యా యాన్ని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌ను సంప్ర దించి పొందవచ్చని సూచించారు. కార్యక్రమం లో జిల్లా ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సబి త, ప్రిన్సిపాల్ జూనియర్ జడ్జి స్వరూప, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్, జైలర్ బి.నాగరాజు, లీగల్ ఎయిడ్ డిఫె న్స్ కౌన్సిల్ ప్రధాన న్యాయవాది మధుసూదన్ రావు, జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి రమేష్‌రెడ్డి, న్యా యవాదులు రాంబాబు, శ్రీరామ్, ఆర్యన్, మెడికల్ ఆఫీసర్లు డా.నారాయణస్వామి, సురేష్, ఆప్తాలమిక్ హేమలత, హెల్త్ సూపర్‌వైజర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:23:12+05:30 IST