ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంధుల ఆరాధ్యదైవం లూయిస్‌ బ్రెయిలీ

ABN, First Publish Date - 2023-01-08T23:11:23+05:30

ప్రత్యేక లిపితో అంధుల జీవితాల్లో వెలుగును నింపిన లూయిస్‌ బ్రెయిలీ అంధుల ఆరాధ్య దైవమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌ రెడ్డి కీర్తించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల టౌన్‌, జనవరి 8 : ప్రత్యేక లిపితో అంధుల జీవితాల్లో వెలుగును నింపిన లూయిస్‌ బ్రెయిలీ అంధుల ఆరాధ్య దైవమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌ రెడ్డి కీర్తించారు. స్థానిక అంధుల ఆశ్రమ పాఠశా ల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణం లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన లూయిస్‌ బ్రెయిలీ 214వ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, వారితో కలిసి కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు రూ.3,116ల పింఛన్‌ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయ డం దేశానికే ఆదర్శమన్నారు. ప్రత్యేక లిపితో పట్టుద లతో విద్యను అభ్యసించిన అంధులు, సమాజంలో ఉన్నతస్థానాన్ని చేరి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ దివ్యాంగులైన వారు సమాజంలో అందరితో సమాను లేనన్నారు. శారీరక వైకల్యం శాపం కాదని, నూన్యత భావాన్ని వీడిననాడే విజయం లభిస్తుందన్నారు. అంధుల పాఠశాల అభివృద్ధి కృషి చేస్తానని, ఎలాంటి సమస్యలు ఉన్న నిరభ్యంతరంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి టిఫిన్‌ బాక్స్‌లను అందజేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పచ్చర్ల శ్రీధర్‌గౌడ్‌, గట్టు ఎంపీపీ విజయ్‌, కేటీదొడ్డి జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నరహరి గౌడ్‌, ధరూరు వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు గోవిందు, రాముడు, ధర్మనాయుడు, చక్రధర్‌రావు, అజయ్‌, కురుమన్న, రిజ్వాన్‌, భగీరథ వంశీ, రాజు, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రంగన్న ఉన్నారు.

Updated Date - 2023-01-08T23:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising