ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వడివడిగా అడుగులు

ABN, First Publish Date - 2023-09-19T23:15:55+05:30

అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. అక్టోబరు ఒకటిన ఓటర్ల తుది జాబితా ప్రచురణకు వడివడిగా కార్యా చరణ అమలు చేస్తోంది. జిల్లా ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించే కలెక్టర్లు రోజూ ఓటరు జాబితాల సవరణ, ఫిర్యాదుల పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదుపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూన్నారు.

మహబూబ్‌నగర్‌లోని ఈవీఎం గోడౌన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌(ఫైల్‌)

ఎన్నికల సన్నాహాల్లో అధికార యంత్రాంగం

వచ్చే నెల 1న ఓటర్ల తుది జాబితా ప్రచురణకు కసరత్తు

కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి జిల్లాలో 31.53 లక్షల ఓట్ల నమోదు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. అక్టోబరు ఒకటిన ఓటర్ల తుది జాబితా ప్రచురణకు వడివడిగా కార్యా చరణ అమలు చేస్తోంది. జిల్లా ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించే కలెక్టర్లు రోజూ ఓటరు జాబితాల సవరణ, ఫిర్యాదుల పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదుపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూన్నారు. ఇప్పటికే ఆగస్టు 21న రెండో సవరణ ఓటర్ల జాబితాను నియోజకవర్గాల వారీగా ప్రకటించారు. తాజాగా ప్రతీ పోలింగ్‌బూత్‌ కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్య క్రమం కొనసాగిస్తున్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయనే అంచనా మేరకు అందుక నుగుణంగా జిల్లాల్లోనూ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా అదనపు ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికా రుల నియామకాలు చేశా రు. వారి ద్వారానే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగు తోంది. వీఆర్‌వోల వ్యవ స్థను ఎత్తేయడంతో పోలిం గ్‌ బూత్‌ అధికారులుగా అంగన్‌వాడీ టీచర్లను నియమించారు. వారి ద్వారానే కొత్త ఓటర్ల నమోదు ఫారాల పరిశీలన కొనసాగుతోంది. మరో వైపు నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై స్టేషన్ల వారీగా రిపోర్టు సిద్ధం చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు బందోబస్తు చర్యలను పోలీస్‌శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆర్‌ఏపీ బృందాలు జిల్లాల్లోకి రాగా, సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అంతే కాకుండా నేర చరిత్ర గల వ్యక్తులను పోలీస్‌ స్టేషన్ల వారీగా గుర్తించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో అక్టోబరు మొదటివారం నాటికి ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు వందశాతం పూర్తయ్యేలా యంత్రాంగం స్థాయులో దృష్టి సారించింది.

Updated Date - 2023-09-19T23:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising