ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లయన్స్‌ క్లబ్‌ సేవలు విస్తరించాలి

ABN, First Publish Date - 2023-07-21T00:18:11+05:30

లయన్స్‌ క్లబ్‌ సేవలు మరింత విస్తరించాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న లయన్స్‌ క్లబ్‌ మక్తల్‌ అధ్యక్షుడు అంబదాస్‌

మక్తల్‌, జూలై 20 : లయన్స్‌ క్లబ్‌ సేవలు మరింత విస్తరించాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్‌ హాల్‌లో లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ మక్తల్‌ బీమా 21వ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు మెల్విన్‌ జోష్‌ చిత్ర పటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. ప్రస్తుతం సమాజంలో కంటి చూపు లేని వారికి క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించడం గొప్ప విషయం అన్నారు. అనంతరం క్లబ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన అంబదాస్‌ ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. అంతకుముందు మునిసిపల్‌ కార్మికులకు దుప్పట్లు, కిట్‌లను పంపిణీ చేశారు.

క్లబ్‌ అధ్యక్షుడిగా అంబదాస్‌ ప్రమాణ స్వీకారం..

మక్తల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీమా అధ్యక్షుడిగా అంబదాస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 2023-24 సంవత్సరానికిగాను తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై అంబదాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. కార్యదర్శిగా వాధిరాజ్‌, కోశాధికారిగా అంజన్‌ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అంతర్జాతీయ న్యాయదుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు శ్రీనివాస్‌, కె.రవికుమార్‌ను సన్మానించారు. లయన్స్‌క్లబ్‌ సభ్యులు జైపాల్‌రెడ్డి, సత్య ఆంజనేయులు, రవికుమార్‌, రాజుల ఆశిరెడ్డి, కొండయ్య, బసవరాజ్‌, శ్రీనివాస్‌, వీరేశం, కర్ని స్వామి, నరేందర్‌, కోళ్ల వెంకటేష్‌, పృథ్విరాజ్‌, శేఖర్‌, కావలి తాయప్ప, ఆడెం సత్యనారాయణ, రాంచంద్రప్ప, భిక్షపతి, అంజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌, అరుణ, జయశ్రీ, సుజాత, పద్మావతి, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising