ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ పాల శీతలీకరణ కేంద్రం మూతపడినట్లేనా?

ABN, First Publish Date - 2023-04-03T23:49:50+05:30

మినీ పాల శీతలీకరణ కేంద్రం మూతపడినట్లేనా అంటూ వాటి పరిధిలోని గ్రామాల రైతులు గుసగుసలాడుకుంటున్నారు.

ఊర్కొండపేటలో మూతపడిన మినీ పాల శీతలీకరణ కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- ఓ అధికారి నిర్ణయంతో ఐదు రోజుల నుంచి బంద్‌

- అధ్యక్షుడి మార్పుపై గందరగోళం

- రాజకీయ నీలినీడలు అలుముకోవడంతో రైతుల ఆందోళన

ఊర్కొండ, ఏప్రిల్‌ 3: మినీ పాల శీతలీకరణ కేంద్రం మూతపడినట్లేనా అంటూ వాటి పరిధిలోని గ్రామాల రైతులు గుసగుసలాడుకుంటున్నారు. వాటి లో పని చేసే ఉద్యోగులు (ఇన్‌చార్జి), సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. పాల ఉత్పత్తిదారులను నష్టం కలిగించే పనులు మేం చేయమని ఉద్యోగులు (ఇన్‌ చార్జి), సిబ్బంది తెలియజేయడంతోనే ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే మూతపడినట్లు స్థానిక పాల ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పాల పరిశ్రమాఽభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేటలో మినీ పాల శీతలీకరణ కేంద్రం 2018లో సుమారుగా రూ.30 లక్షలు వెచ్చించి పాల ఉత్పత్తిదారుల ప్రయోజనా ల కోసం ప్రారంభించారు. మినీ పాల శీతలీకరణ కేంద్రం ఊర్కొండపేట పరిధిలో బొమ్మరాజుపల్లి, రాంరెడ్డిపల్లి, ముచ్చర్లపల్లి 1, 2లు, ఊర్కొండ, ఊ ర్కొండపేట, నర్సంపల్లి, ఠాకూర్‌ తండా, గుండ్లగుంటపల్లి గ్రామాల నుంచి పాల ను ఈ కేంద్రానికి రోజువారిగా సుమారుగా 3000 లీటర్లు వస్తున్నాయి. ప్రారం భించిన నాటి నుంచి గత ఆరు నెలల వరకు సజావుగా కొనసాగిందని స్థానిక పాల రైతులు తెలి పారు. ఆరు నెలల క్రితం మినీ పాల శీతలీకరణ కేంద్రం ఇన్‌చార్జికి పాలను ఎక్కువగా చూపిం చి తమ వాటా తమకు ఇవ్వాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, రైతులకు ఇబ్బందులు కలుగజేసే పనులు తాము చేయమని వారు తెలియజేయడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పాల ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బిల్లులను గ్రామ సెంటర్ల పెయిడ్‌ సెక్రటరీలు తమ ఖాతాల్లో జమ చేసుకున్న అనంతరం రైతులకు బిల్లులు చెల్లిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో గ్రామాల సెక్రటరీలు, అధ్యక్షుల మద్య తగదాలు ఏర్పడి ఒక్క సెంటరుకు ఇద్దరు అధ్యక్షులను ఎన్నుకున్నారు. దాంతో అది కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి మినీ పాల శీతలీకరణ కేంద్రానికి ఇద్దరు పాత, కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. దీని పర్యవసానంగా గందరగోళంగా మారడంతోనే మూడపడినట్లు పాల ఉత్పత్తిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారిగా వస్తున్న పాలను కల్వకుర్తి పాల సెంటర్‌కు పంపిస్తుండటంతో రైతులపై అధిక భారం పడుతుందని, గ్రామాల్లో రాజకీయంగా పలుకుబడిన నాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని తమ వారికే పదవులు దక్కించుకోవాలని పావులు కదపుతుండటంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రూ. 13 లక్షల వరకు డిపాజిట్‌ ఉంది

ఊర్కొండపేట మినీ పాల శీతలీకరణ కేంద్రం లాభాల్లో ఉండి సుమారుగా రూ.13 లక్షల వరకు డిపాజిట్‌ ఉంది. దాంతో కల్వకుర్తి పరిధిలోని అన్ని నష్టాల్లో ఉండగా ఇది ఒక్కటి మాత్రమే లాభాల్లో ఉండటంతో ఉన్నతాధికారులు దీన్ని సైతం నష్టాల్లో చూపించాలని పదే పదే కోరడంతో మేము ఒప్పుకో లేదు. అప్పటి నుంచి మాపై కక్ష కట్టినట్లు అధికారులు వ్యవహరించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కోరం లేకుండా నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. అదేకాకుండా మా గ్రామం నుంచి వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారు.

- బూర్గుపల్లి రవీందర్‌సాగర్‌, పాత అధ్యక్షుడు, మినీ పాల శీతలీకరణ కేంద్రం ఊర్కొండపేట

పొరపాట్లు చేయలేదు..

మా ఉద్యోగులు ఎక్కడా పొరపాట్లు చేయలేదు. ఊర్కొండపేట మినీ పాల శీతలీకరణ కేంద్రం నిర్వాహకులు, గ్రా మాల పాల కేంద్రాల నిర్వాహకుల మధ్య సమన్వయం లోపించడంతో కొంత మేరకు ఇబ్బందులు కలుగడం జరిగింది. కోరం ప్రకారమే నూతనంగా అధ్యక్షుడిని ఎన్నిక జరిగింది. త్వరలోనే మూతపడిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తాం.

- సత్యనారాయణయాదవ్‌, విజయ డైరీ జిల్లా అధికారి

Updated Date - 2023-04-03T23:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising