కేసీఆర్ లాగా మాట తప్పం
ABN, First Publish Date - 2023-07-21T23:21:22+05:30
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, కేసీఆర్ మాదిరిగా మాట తప్పమని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2లక్షలు రుణమాఫీ : మాజీ మంత్రి చిన్నారెడ్డి
రేవల్లి, జూలై 21: కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, కేసీఆర్ మాదిరిగా మాట తప్పమని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం గోపాల్‌పేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పొలికెపాడు, జింకలబీడు తండా, ఆముదాలకుంటతండా, లక్ష్మి దేవమ్మపల్లి, చాకలిపల్లి, ఎర్రగట్టుతండా, దేవరగట్లు తండా, రేగుల గట్టు తండా గ్రామాలలో పార్టీ గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే గ్యాస్ సిలిండర్ రూ.500 లకే ఇస్తా మని తెలిపారు. ఖాళీ స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామ ని తెలిపారు. పార్టీ కోసం ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొంకి వెంకటేష్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దివాకర్, నాయకులు రాములు, ప్రవీణ్ రెడ్డి, నరహరి, శ్రీను, లక్ష్మణ్, మధు, ప్రవీణ్, గోవర్ధన్ రెడ్డి, రాములు యాదవ్, కుమ్మరి గోవింద్, విష్ణు, పురుషోత్తం యాదవ్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T23:21:22+05:30 IST