ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళా వైభవాన్ని కాపాడుకుందాం

ABN, First Publish Date - 2023-02-07T00:06:52+05:30

గద్వాల సంస్థానం సాంస్కృతిక, కళా వైభావాన్ని బాధ్య తగా కాపాడుకుందామని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు అన్నారు.

భక్తులకు అనుగ్రహ సందేశం ఇస్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదులు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 6 : గద్వాల సంస్థానం సాంస్కృతిక, కళా వైభావాన్ని బాధ్య తగా కాపాడుకుందామని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు అన్నారు. సంస్థానాధీశుల కాలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో మంత్రాలయం మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు మరింత సహకారం అందించాలని ప్రజలను కోరారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన మహా రథోత్సవంలో ఆయన పాల్గొని ప్రజలకు అనుగ్రహ సందేశం ఇచ్చారు. సంస్థాన ఆనవాళ్లు, అప్పటి కళా వైభవం, చారి త్రక సంపద, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి అందించేందుకు ప్రత్యేక మ్యూజియం, గ్రంథాలయాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. రథశాలను పురాతన, చారిత్రక వైభ వాన్ని చాటేలా ఆధునీకరిస్తామన్నారు. రథోత్స వాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భక్తులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

Updated Date - 2023-02-07T00:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising