చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం
ABN, First Publish Date - 2023-03-02T23:11:26+05:30
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
పాన్‌గల్, మార్చి 2 : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురు వారం మండల పరిఽధిలోని తెల్లరాళ్లపల్లి చెక్ డ్యామ్‌లో మినీ లిప్టు ఏర్పాటు చేసి, మోటర్లు ఆన్ చేసి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వీపనగండ్ల మండలం కొర్లకుంట, బొల్లారం రైతుల వినతి మేరకు చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మినీ లిప్టు ఏర్పాటు చేసి సాగునీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం మల్లాయపల్లి, తిమ్మయ్య చెరువు నింపేందుకు బీమా కాల్వకు లిప్టు ఏర్పాటు పనులు కొనసాగుతున్నా యన్నారు. అంతకుముందు చింతకుంట గ్రామానికి చెందిన సర్పంచ్ అనూష తో పాటు, పలువురు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్య క్రమంలో పాన్‌గల్, వీపనగండ్ల ఎంపీపీలు మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, కమ లేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమ్‌నాథ్‌నాయక్, రైతుబంధు మండల అధ్యక్షుడు వెంకటయ్యనాయుడు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాముయాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గానికి మంజూరైన కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే స్థల పరీశీలన చేశారు. మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్ ప్రాంతంలో ఏర్పాటుచేసే కేంద్రియ విద్యాలయం రెండవ కేంద్రియ విద్యాలయం అన్నారు.
Updated Date - 2023-03-02T23:11:26+05:30 IST