ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగుళాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2023-01-22T23:34:45+05:30

జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రా రంభమయ్యాయి.

ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్రహాం, అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన

ఆలయ కమిటీ చైర్మన్‌, ఈవో

- ధ్వజారోహణం కార్యక్రమంలో

పాల్గొన్న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూరు, జనవరి22: జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రా రంభమయ్యాయి. అర్చకులు ఉదయం స్వామివారి ఆనతి స్వీకరణ, మహాగణపతి పూజ, రుత్విక్‌ వరణం, పున్యాహ వచనం, యాగశాల ప్రవేశం, మహా కలశస్థాపన మొద లైన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అంకు రార్పణ, ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. ఉదయం చండీహోమం వద్ద అ ర్చకులకు ఆలయ కమి టీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్‌కుమార్‌ పట్టు వస్త్రాలను అందజేశారు. ముందు గా బాలబ్ర హ్మేశ్వర ఆలయం నుంచి ఆ లయ ప్రధాన అర్చకు డు ఆనంద్‌ శర్మ ప ట్టువస్త్రాలను తీసుకెళ్లి అమ్మవారికి, స్వామి వారికి అందించారు. బాలబ్రహ్మేశ్వర స్వామి మూలవిరాట్‌కు ఈవో పురేంధర్‌కుమార్‌, అ ర్చకులు, సిబ్బంది ప ల్లకీ సేవ నిర్వహిం చారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్ర మానికి ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం, అలంపూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ్మ హాజరుకాగా, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ అర్చ కుడు విక్రాంత్‌ శర్మ ధ్వజస్తంభానికి ప్రత్యేక హారతి ఇ చ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఉ షాదేవి, జయ్యన్న, విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆలయ ముఖ్య అర్చ కులు ఆనంద్‌ శర్మ, శ్రీకాంత్‌ శర్మ, ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

అమ్మవారికి బంగారు డాలర్‌ విరాళం

జోగుళాంబ అమ్మవారిని కడపకు చెందిన చంద్ర మౌలీశ్వర రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు . ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం రూ. ఐదులక్షల విలువ గల బంగారు డాటర్‌ను ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస రెడ్డి, ఈవో పురేంధర్‌ కుమార్‌, ఆలయ ధర్మకర్తల సమక్షంలో అందజేశారు.

Updated Date - 2023-01-22T23:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising