ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం

ABN, First Publish Date - 2023-07-06T23:27:38+05:30

సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ పంచాయతీ కార్మి కులు సమ్మె బాట పట్టారు.

జిల్లా కేంద్రంలో చేపట్టిన పంచాయతీ కార్మికుల సమ్మెలో మాట్లాడుతున్న పొదిల రామయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య

- జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/తిమ్మాజిపేట/తాడూరు/ బిజినేపల్లి/పెంట్లవెల్లి/వెల్దండ/కోడేరు/కల్వకుర్తి/ఉప్పునుంతల/బల్మూరు, జూలై 6 : సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ పంచాయతీ కార్మి కులు సమ్మె బాట పట్టారు. గురువారం జిల్లా కేంద్రంతో పాటు, పలు మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మె చేపట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆ వరణలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచా యతీ కార్మికులకు పీఆర్సీని వర్తింపజేసి, సమస్య లు పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులకు పీఆర్సీని వర్తింపజేసి వేతనాలు పెంచిన రాష్ట్ర ప్ర భుత్వం పంచాయతీ కార్మికులను విస్మరించడం విచారకరమన్నారు. ఇటీవలే మొక్కుబడిగా కేవ లం వేయ్యి రూపాయల వేతనం పెంచి సీఎం కేసీఆర్‌ చేతులు దులుపుకున్నారని విమర్శిం చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ పం చాయతీ కార్మికులకు 30 శాతం పీఆర్సీ వర్తింప జేసి, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచా యతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు కురుమయ్య, తిరుపతయ్య, ల్లెయ్య, కాశీం, శాంతయ్య, వెంకట్‌ రెడ్డి, వెంకటయ్య, అలివేలమ్మ, దేవేంద్రమ్మ, రామే శ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, తిమ్మాజిపేటలోని జడ్పీహెచ్‌ఎస్‌ పక్కన ప్రధాన రహదారిపై చేపట్టిన సమ్మెలో అంబేడ్కర్‌ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీనివాస బహదూర్‌ కార్మికు లనుద్ధేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి, కోశాధికారి అశోక్‌, యూని యన్‌ మండల నాయకులు పాల్గొన్నారు. తాడూ రు ఎంపీడీవో కార్యాలయం ముందు చేపట్టిన స మ్మెలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాశన్న మాట్లా డారు. కారోబార్లను అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. బిజినేపల్లిలో ని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో చేపట్టిన స మ్మెలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. పెంట్లవెల్లిలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు చేపట్టిన సమ్మెలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌ మాట్లాడారు. వెల్దండలో కార్మికులు నిర్వహించిన సమ్మెకు సీఐటీయూ నాయకుడు ఆంజనేయులు మద్దతు తెలిపి, మాట్లాడారు. కోడేరు బస్టాండ్‌ ఆవరణలో చేపట్టిన సమ్మెలో గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ మండల ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మద్దతు తెలిపి, మాట్లాడారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీని వాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ, కార్మికులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఎంపీడీవో కార్యాలయం ముందు చేపట్టిన సమ్మెలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ల పాండుగౌడ్‌, సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఉప్పునుం తలలోని పరిషత్‌ కార్యాలయ ఆవరణలో చేపట్టిన సమ్మెలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్‌ మాట్లాడారు. బల్మూరులో పంచాయతీ కార్యాలయం ముందు నిర్వహించిన సమ్మెలో గిరి జన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్‌ మా ట్లాడారు.

Updated Date - 2023-07-06T23:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising