గోవిందా.. గోవింద
ABN, First Publish Date - 2023-03-07T23:19:50+05:30
భక్తుల గోవింద నామస్మరణతో శ్రీరంగనాథ ఆలయం, ప్రాంగణం మారుమోగింది.
- ఘనంగా శ్రీరంగనాథ స్వామి రథోత్సవం
- స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
శ్రీరంగాపురం, మార్చి 7 : భక్తుల గోవింద నామస్మరణతో శ్రీరంగనాథ ఆలయం, ప్రాంగణం మారుమోగింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథస్వామి ఆల యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల తో జరుగుతున్నాయి. మంగళవారం ఆలయ ధర్మకర్త ఆరుద్రదేవ్‌రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని పల్లకీలో చేర్చి రథోత్సవ కార్యక్రమం నిర్వహిం చారు. వేలాదిమంది భక్తులు గోవింద నామ స్మరణతో రథోత్సవాన్ని లాగారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణతో కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం భాజాభజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండువ గా జరిగింది.
హాజరైన ప్రముఖులు
రథోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్య క్షుడు శివసేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, శ్రీరంగాపురం, పెబ్బేరు, వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు గాయత్రి, ఆవుల శైలజ, కిచ్చారెడ్డి, మేఘారెడ్డి, గ్రామ సర్పంచ్ వినీలరాణి హాజర య్యారు. కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్‌రావు, వనపర్తి కాంగ్రెస్ నాయకులు చీర్లచందర్, కదిరె రాములు, బీఆర్‌ఎస్ నాయ కులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీరంగాపూర్ సేవా సమితి ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సతీ మణి వాసంతి ప్రారంభించారు. ఇదే గ్రామానికి చెందిన శ్రీహరిరాజు భక్తులకు పులిహోర ప్యా కెట్లు, నారాయణదాస్, జగదీష్ బ్రదర్స్‌తో పాటు, సేవాభారతి సభ్యులు, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.
ప్రారంభమైన జాతర
రంగనాథస్వామి రథోత్సవంతో శ్రీరంగాపురం లో జాతర ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం లో మిఠాయి దుకాణాలు, గాజుల అంగళ్లు, లేడీస్ కార్నర్, హోటళ్లు, ప్లాస్టిక్ బొమ్మల దుకాణాలతో పాటు, మద్యం, మాంసం దుకాణాలు వెలిశాయి. వనపర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో ఐదు మం ది ఎస్సైలు, 30 మంది పోలీస్ సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు.
Updated Date - 2023-03-07T23:19:50+05:30 IST