ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టం

ABN, First Publish Date - 2023-10-26T23:00:21+05:30

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీకే.అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ

కొత్తకోట, అక్టోబరు 26 : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ అన్నారు. గురువారం కొత్తకోటలో ఓ శుభకార్యానికి వచ్చిన ఆమె అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్‌ వన్‌గా చేసిన ఘనత మోదీదేనన్నారు. నా ప్రమేయం లేకుండానే కాంగ్రెస్‌లో చేరుతున్నానని కొన్ని మీడియా సంస్థలు ప్రకటించడాన్ని ఖండించారు. రాజకీయ నాయకుల అనుమతి లేకుండా భవిష్యత్‌ను శాసించే స్థాయిలో మీడియా ఉండడం మంచిది కాదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగమే ఈ దుష్ప్రచారమన్నారు. నా వివరణ లేకుండా కథనాలు ప్రకటిస్తే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోకపోతే తగిన విధంగా బుద్ది చెపుతామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్దన్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలమన్నెమ్మ, దేవరకద్ర బాలన్న, నంబిరాజు, మాధవరెడ్డి, దాబ శ్రీనివాస్‌రెడ్డి, నారాయణమ్మ, వెంకట్‌రెడ్డి, భరత్‌భూషణ్‌, నరేందర్‌గౌడ్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-10-26T23:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising