గద్వాల చేనేత చీరలకు ప్రపంచ ప్రఖ్యాతి
ABN, First Publish Date - 2023-08-12T23:28:11+05:30
ప్రపంచంలోనే గద్వా ల చేనేత చీరలకు ప్రఖ్యాతి ఉందని, దానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్టమోహన్‌రెడ్డి
- అలరించిన చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో
- కలెక్టరేట్‌లో జాతీయ
చేనేత వారోత్సవాలు
గద్వాల క్రైం, ఆగస్టు 12 : ప్రపంచంలోనే గద్వా ల చేనేత చీరలకు ప్రఖ్యాతి ఉందని, దానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ చేనేత దినోత్స వ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గద్వాల ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన చేనేత కార్మికుల ర్యాలీని కలెక్టర్ వల్లూరు క్రాంతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షో నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అ నేక మంది చేనే త పరిశ్రమ ద్వా రా ఉపాధి పొం దుతున్నారన్నా రు. నేడు తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అనే క సంక్షేమ పథకాలు అమలు చేసి వారిలో ఆ త్మస్థైర్యాన్ని నింపిందన్నారు. ప్రపంచంలోనే గద్వాల చీర అంటే ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం గద్వాల చీరల ప్ర ఖ్యాతి ఇంకా పెంచాలని ఫ్యాషన్ షో తదితర ఆక ర్శనీయమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల గద్వాల చీరలకు మరింత ప్రఖ్యాతి పెరుగుతుందన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేనేత మిత్ర, చేనేత బీమా, ఇతర పథకాలను అమలు చేసి ఆదుకుంటుందని తెలిపారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కున్నారన్నారు. చేనేత కళను కాపాడుకోవాల్సిన అ వసరం ఉన్నదన్నారు. 2010లో జాగ్రఫీ చేనేత ఇం డికేషన్ గుర్తించిందని ప్రపంచంలోనే గద్వాల చేనే త చీరలంటే ఎంతో ఖ్యాతి ఉందన్నారు. అధికారు లు, ప్రజలు చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చేనేత మిత్ర పథకం ద్వారా మంజూరైన చెక్కులను కార్మికులకు అంద జేశారు. ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థులకు ధ్రు వపత్రాలు, మెమోంటోలు అందజేశారు. అనంతరం చేనేత వృత్తిలో నైపుణ్యం పొందిన 37మంది చేనేత కార్మికులను సన్మానించారు. సమావేశంలో చేనేత సహాయ సంచాలకులు గోవిందయ్య, జడ్పీటీసీ స భ్యుడు రాజశేఖర్, ఎంపీపీ విజయ్‌కుమార్, కౌన్సి లర్ శ్రీమన్నానారాయణ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-12T23:28:11+05:30 IST