ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమమే ధ్యేయం

ABN, First Publish Date - 2023-04-24T23:21:43+05:30

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

రైతు వేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- రైతు వేదిక ప్రారంభం

మరికల్‌, ఏప్రిల్‌ 24 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కన్మనూర్‌లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. అనంతరం చిత్తనూర్‌, ఎక్లాస్‌పూర్‌, జిన్నారం, బుడ్డాగానితండా, కన్మనూర్‌ గ్రామాలకు చెందిన 18 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు - మన బడి’ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డ్డి, జిల్లా విద్యాశాఖాఽఽధికారి లియాఖత్‌, సంపత్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాఽధికారులు శివకుమార్‌, అనిత, సర్పంచ్‌ శరత్‌చంద్రరెడ్డి పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,060, బీ గ్రేడ్‌ రకానికి రూ.2,040 కొనుగోలు చేస్తోందన్నాన్నారు. పీఏసీఎస్‌ కార్యదర్శి రాములు, విజయ్‌కుమార్‌, ఎల్లారెడ్డి, రైతులు బసిరెడ్డి, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

బండారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మాగనూరు : మండలంలోని కొత్తపల్లిలో మాదాసి కురువ కులదైవమైన బీరప్ప బండారు ఉత్సవాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురువ కులస్తులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. మండల రైతు కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, వాకిటి శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఈశ్వర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-24T23:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising