ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2023-03-05T23:02:26+05:30

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌ సూచించారు. ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో పార్లమెంట్‌ కన్వీనర్‌ డోకూరు పవన్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమానికి అరవింద్‌ మీనన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహబూబ్‌నగర్‌లో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌ సూచించారు. ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో పార్లమెంట్‌ కన్వీనర్‌ డోకూరు పవన్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమానికి అరవింద్‌ మీనన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతకుమార్‌ తదితర ముఖ్య నాయకులు హాజరైన ఈ సమావేశంలో అరవింద్‌ మీనన్‌ పలు సూచనలు చేశారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. గ్రామ, బూత్‌ స్థాయిల్లో పార్టీ గుర్తుని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎక్కడి కక్కడ ఆయా ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లు, వాగ్దానాలు అమలు చేయని విషయాలను గుర్తించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్రంలో ప్రఽధాని నరేంద్ర మోదీ సర్కార్‌ అమలు చేస్తోన్న పథకాలను వివరించాలని తెలిపారు. స్థానిక సమస్యలపై ఉద్యమించాలని చెప్పారు. సమా వేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, పద్మజారెడ్డి, రతంగ్‌ పాండురంగారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లాల అధ్యక్షులు శ్రీనివాసులు, సదానం దంరెడ్డి, రాజవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించాలి

వనపర్తి అర్బన్‌: పోలింగ్‌ బూత్‌ పరిధిలో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌ చెప్పారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ నా గర్‌కర్నూల్‌ పార్లమెం ట్‌ పరవాస్‌ యోజన సమా వేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరవింద్‌ మీనన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్‌, అసెంబ్లీ కోర్‌ స భ్యులుగా క్రియాశీలకం గా పని చేసే వారిని నియమిం చాలన్నారు. సమా వేశంలో పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బంగారు శ్రుతి, జాతీయ వోబీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, జాతీ య ఖాదీ బోర్డు అధ్యక్షుడు పేరాల శేఖర్‌, బీజేపీ జాతీయ నాయకులు చింతా సంబమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, కో కన్వీనర్‌ జింకల కృష్ణయ్య, జిల్లాల అధ్యక్షులు ఏ.రాజవర్దన్‌రెడ్డి, రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising