ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా పశుబల ప్రదర్శన పోటీలు

ABN, First Publish Date - 2023-02-19T23:27:53+05:30

మండలంలోని రేమద్దులలో ఆదివారం శివశంకర హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.

బండలాగుడు పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్‌గల్‌, ఫిబ్రవరి 19 : మండలంలోని రేమద్దులలో ఆదివారం శివశంకర హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీ ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్‌ గురునాథ్‌కు చెందిన వృషభ రాజములు ప్రథమ బహుమతి సాధించాయి. ఎమ్మెల్యే బీరం రూ. 60వేల నగదును గురునాథ్‌కు అందించారు. ద్వితీయ స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా పెద్దొడి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ వృషభ రాజములు నిలిచాయి. ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్‌ కేతూరి వెంకటేష్‌కు లక్ష్మీనారాయణ రూ. 50వేలు అందించారు. తృతీయ స్థానంలో వనపర్తి జిల్లా పెద్దదగడ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ వృషభ రాజులు నిలిచాయి. రేమద్దు ల గ్రామానికి చెందిన పల్లె జైపాల్‌రెడ్డి గోపాల కృష్ణకు రూ.40వేల నగదు అందించారు. కార్యక్ర మంలో ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సోమ్‌నాథ్‌నాయక్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ దామోదర్‌రెడ్డి, సర్పంచు మంజుల, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచు యాదగిరిచారి, బీఆర్‌ఎస్‌ నాయకులు హరిప్రసాద్‌రెడ్డి, పీట్ల కథాల్‌, రంగాపురం శివారెడ్డి, రాములు, తిరుపత య్య, కృష్ణయ్య, సీపీఎం నాయకులు పెంటయ్య, నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T23:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising