ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్‌ ప్రమాదాలు అరికట్టవచ్చు

ABN, First Publish Date - 2023-06-26T23:17:10+05:30

విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా క్షేత్రస్థాయిలో నియంత్రణ ఉపకరణాలు వాడాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రభాకర్‌ సిబ్బందికి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రభాకర్‌

నారాయణపేట టౌన్‌, జూన్‌ 26: విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా క్షేత్రస్థాయిలో నియంత్రణ ఉపకరణాలు వాడాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రభాకర్‌ సిబ్బందికి సూచించారు. సోమవారం ఉప విద్యుత్‌ కేంద్రం ఆవరణలో జరిగిన విద్యుత్‌ భద్రత వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు గ్లౌజులు వాడాలని, ఆర్జీన్‌, జేఎల్‌ఎమ్‌, ఎల్‌ఎమ్‌లు ఫీజ్‌ ఆఫ్‌ కాల్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ వాడాలని, అర్తింగ్‌ రాడ్‌తో పోల్‌పై విద్యుత్‌ను డిస్సార్జ్‌ చేసి పనులు చేస్తే విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టవచ్చున్నారు. ఉప విద్యుత్‌ కేంద్రంలో ఆపరేటర్లు ఎల్‌సీ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎల్‌సీ నంబర్లు తీసుకొని ఫీడర్‌ పేర్లు సరిగ్గా తెలుసుకొని ఎల్‌సీలు తీసుకోవాలని సూచించారు. 11 కేవీ లూజ్‌ లైన్లు ఉన్న ప్రాంతాలను గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చి సరి చేసుకోవాలని, ప్రమాదాల బారిన పడకుండా చూడాలని కోరారు. ఇదీవరకు పంపిణీ చేసిన సామగ్రిని సిబ్బంది వాడడం లేదని, ఉపకరణాలను వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈలు సాయినాథ్‌ రెడ్డి, అనిల్‌, వినోద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising