ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

ABN, First Publish Date - 2023-09-22T22:49:17+05:30

జోగుళాంబ గద్వాలను గంజాయి, మత్తు పదార్ధాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెకర్‌ వల్లూరు క్రాంతి, పాల్గొన్న ఎస్పీ సృజన

- ప్రజలు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 22 : జోగుళాంబ గద్వాలను గంజాయి, మత్తు పదార్ధాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి కోరారు. కలెక్టరేట్‌ కాన్పరెన్స్‌ హాలులో ఎస్పీ సృజనతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గంజాయి, హెరాయిన్‌ తదితర మత్తు పదార్ధాలను గుర్తించినా, ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసినా, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖ అఽధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో ఎదురయ్యే అనర్థాలను కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో చంద్రకళ, ఫారెస్ట్‌ అధికారి జాకీరొద్దీన్‌, ఎక్సైజ్‌ సీఐ బానోత్‌పటేల్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారి మహ్మద్‌ రఫీ పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో చేనేత కార్మికులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముద్ర రుణాలు, వాటి సబ్సిడీపై వివరించారు. చేనేత మిత్ర ఖాతాకు ఈకేవైసీని అనుసంధానం చేయాలన్నారు. పెన్షన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సమర్థ ట్రైనింగ్‌, రుణాలు తదితరాలపై చర్చించారు. వాటిని త్మరగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు సమస్యలను తన దృష్టికి తెస్తే, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సమావేశంలో సహాయ సంచాలకులు గోవిందయ్య, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, ఏడీఓవు రాజేశ్వర్‌రెడ్డి, విజయకుమార్‌, సీడీఈ మహేష్‌, మాస్టర్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు అక్కల శ్రీనివాస్‌, శాంతారామ్‌, సురేష్‌, కార్మిక సంఘం నాయకులు నాగరాజు, భీమేశ్‌, జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T22:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising