పోయి రావలె హస్తినకు..
ABN, First Publish Date - 2023-09-22T22:42:38+05:30
‘అయిననూ పోయిరావలె హస్తినకు..’ ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల మదిలో ఉంది. ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న నాయకులు ఢిల్లీ బాట పట్టి, హస్తినలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
టికెట్ల కోసం ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ ఆశావహులు
వడపోతలో ముఖ్యభూమిక పోషించే నాయకుల వద్దకు క్యూ
వారి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
సర్వేలు, జనాదరణే ప్రామాణికమంటోన్న అధిష్ఠానం, ముఖ్య నాయకులు
టికెట్ల కోసం పోటాపోటీ
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 22(ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): ‘అయిననూ పోయిరావలె హస్తినకు..’ ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల మదిలో ఉంది. ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న నాయకులు ఢిల్లీ బాట పట్టి, హస్తినలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థుల వడ పోతలో ముఖ్య భూమిక పోషించే పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు, స్ర్కీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, సీడబ్ల్యూసీ సభ్యుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి జాబితా ప్రకటనతో పాటు, మిగిలిన సీట్లకు కూడా షార్ట్‌లిస్టు తయారవుతుందనే సంకేతాలతో అందులో తమ పేర్లు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు మినహా ఆశావహులంతా హస్తినకు చేరి, అధిష్ఠానం మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తుండడంతో నియోజక వర్గాల్లో సందడి లేకుండా పోయింది.
షార్ట్ లిస్టు వచ్చే వరకు పోటాపోటీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. మొత్తం 14 నియోజక వర్గాలకు 80 మంది దరఖాస్తు చేసుకు న్నారు. ప్రతీ నియో జకవర్గం నుంచి సగ టున ఆరుకు పైగా దరఖాస్తులు రావడంతో పీఈసీ(ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ)లో చర్చించిన తర్వాత ఒకటి నుంచి నాలుగు పేర్లను షార్ట్‌లిస్టు చేశారు. శుక్రవారం నాలుగోసారి ఢిల్లీలో సమావేశమైన స్ర్కీనింగ్ కమిటీలో మాత్రం ఈ జాబితాను కుదించారని, కొన్ని నియోజకవర్గాలకు ఒక్క పేరే ఎంపిక చేశారని, మిగిలిన నియోజకవర్గాలకు మూ డు పేర్లకు మించకుండా షార్ట్ లిస్టు చేశారనే చర్చ జోరుగా ఊపందుకుంది. కొ డంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, అలంపూర్ నుం చి సంపత్‌కుమార్, కల్వకుర్తి నుంచి వంశీ చంద్‌రెడ్డి, అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ పేర్లు ఖరారు చేసినట్లు చెబు తున్నారు. ఒకే నియోజకవర్గంలో పోటీ పడుతోన్న మరో ఇద్దరు కీలక నాయకులకు చెరో చోట పోటీ చేసే అవకాశం కల్పిం చాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ ఇంకా తు ది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, లేక ముగ్గురు పేర్లను స్ర్కీనింగ్ కమిటీ షార్ట్‌లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఆశా వ హులంతా తమ ప్రయ త్నాలు ముమ్మరం చేశా రు. ఢిల్లీ వెళ్లి మరీ తమ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టికెట్ల ఎంపికలో ప్రధాన భూమిక పోషించే కీలక నాయకుల ఆశీస్సులు తమకే ఉన్నాయంటే, తమకు ఉన్నాయని ప్రచారం చేసుకుంటు న్నారు.
ఢిల్లీకి రావొద్దంటున్న అధిష్ఠానం
కీలక నాయకుల ఆశీస్సులతో టికెట్లు సా ధిస్తామంటూ ఆశావహులు ఢిల్లీదాకా వెళ్లి తమ ప్రయత్నాలు చేస్తుంటే, అధిష్ఠా నం లోని ముఖ్య నాయకులతో పాటు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు మాత్రం టికెట్ల కోసం తమ వద్దకు రావద్దని గట్టిగా చెబుతున్నారు. నిత్యం జనాల్లో ఉండాలని, పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను జనా ల్లోకి తీసుకెళ్లాలని అంటున్నారు. అదే సమ యంలో స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనా పోరాడాలని సూచిస్తున్నారు. సర్వేలు కొనసా గుతున్నాయని, ఆ రిపోర్టులతో పాటు జనాదరణ ఎవరికి ఉంటే వారికే టికెట్లు వ స్తాయని తేల్చిచెబుతున్నారు. ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు చేయడం క్యాడర్‌లో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-09-22T22:42:38+05:30 IST