ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాడి ఓడిన జిల్లా జట్టు

ABN, First Publish Date - 2023-05-31T23:07:50+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌-2023 రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు రన్నర్స్‌గా నిలిచింది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కప్పు అందుకుంటున్న జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎం కప్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో రెండవ స్థానం

గద్వాల అర్బన్‌, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌-2023 రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం ఉదయం నిర్వహించిన సెమీ ఫైనల్‌లో నిజామాబాద్‌ జట్టుపై 4-1 గోల్స్‌ సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. సాయంత్రం హైదరాబాద్‌ - గద్వాల జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆఫ్‌ టైం వరకు రెండు జట్లు గోల్స్‌ సాధించలేదు. సెకండాఫ్‌లో హైదరాబాద్‌ జట్టు మూడు గోల్స్‌తో విజయం సాధించింది. జిల్లా జట్టు ఓటమి పాలై రెండవ స్థానంలో నిలిచింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రూ.75వేల నగదు, సిల్వర్‌ మెడల్స్‌, ట్రోఫీని గద్వాల జిల్లా ఫుట్‌బాల్‌ జట్టుకు అందించారని కోచ్‌ విజయ్‌కుమార్‌, లైజనింగ్‌ ఆఫీసర్‌ జితేందర్‌ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన జిల్లా ఫుట్‌బాల్‌ జట్టుకు ఎర్రవల్లిలోని సరస్వతి టెక్నో స్కూల్‌ యజమానులు శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి రూ.25 వేల పారితోషికాన్ని ప్రకటించి అభినందనలు తెలిపారు. జట్టు సభ్యులను ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ప్రవీణ్‌ సేవా సమితి అధ్యక్షుడు ఇండికా శివ, సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ క్రీడాకారులు అభినందించారు.

Updated Date - 2023-05-31T23:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising