ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తండాలు అభివృద్ధి

ABN, First Publish Date - 2023-08-31T23:58:31+05:30

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తండాలు అభివృద్ధి చెందాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

నసరుల్లాబాద్‌ తండాలో పంచాయతీ భవనం పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 31 : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తండాలు అభివృద్ధి చెందాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం నసరుల్లాబాద్‌తండాలో గురువారం గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి వరకు తండాలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవన్నారు. స్వరాష్ట్రంలోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. మిషన్‌భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తు న్నామని తెలిపారు. తండాలకు రహదారులు నిర్మించామని పేర్కొన్నారు. గతంలో జరిగిన అభివృద్దిని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, సర్పంచ్‌ ప్రణీల్‌చందర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రఘుపతిరెడ్డి, శంకర్‌నాయక్‌, రాజేశ్‌నాయక్‌, తండావాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-31T23:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising