ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధి పరిపూర్ణం కావాలి

ABN, First Publish Date - 2023-09-22T22:43:41+05:30

వనపర్తి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు చేపట్టామని, ఒకే టర్మ్‌లో ఇన్ని నిధులు తెచ్చిన ఏకైక నియోజకవర్గంగా వనపర్తి నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

భావితరాల భవిష్యత్‌ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం..

వనపర్తిలో రూ.10 కోట్లతో ఐకాన్‌గా ఐటీ టవర్‌ నిర్మాణం

పట్టణంలో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు

ఈ నెల 29న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకారశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు చేపట్టామని, ఒకే టర్మ్‌లో ఇన్ని నిధులు తెచ్చిన ఏకైక నియోజకవర్గంగా వనపర్తి నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. చేపట్టిన, చేపట్టబోయే పనులు పూర్తయ్యి.. అభివృద్ధి పరిపూర్ణం కావాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మంత్రి శుక్రవారం విలేకరుల సమావే శంలో మాట్లాడారు. భావితరాల భవిష్యత్‌ కోసం అహర్నిశలూ పని చేస్తున్నామని తెలిపారు. నియోజక వర్గానికి మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ టీయూ ఎఫ్‌ఐడీసీ (తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా రూ.55 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలి పారు. అందులో రూ.10 కోట్లతో వనపర్తిలో ఐకాన్‌ గా ఐటీ టవర్‌ నిర్మించ నున్నట్లు తెలిపారు. అలాగే బీసీ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం, పాలిటెక్నిక్‌ కాలే జీ పునరుద్ధరణ, బైపాస్‌ రోడ్డుకు శంకుస్థాపన, పెబ్బేరు సంతలో సౌకర్యాల కోసం రూ.ఐదు కోట్లు, కం దకం, మార్కెట్‌ అభివృద్ధి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు అప్రోచ్‌ రోడ్డు, అంతర్గత రహదారులు, జర్నలిస్టు భవనం నిర్మాణం కోసం రూ.50 లక్షలు, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రోడ్ల విస్తరణ కొలిక్కి వచ్చిందని, పెబ్బేరు మెయిన్‌ రోడ్డు విస్తరణ కూడా జరుగుతోందని తెలిపారు. ఎన్నికలు ఉన్నా కొనసాగాల్సిన అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా టౌన్‌ హాల్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, జిల్లా గ్రంథాలయాలను ప్రారంభిస్తామని, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని తెలిపారు. అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు వచ్చే నాలుగైదు రోజుల్లో పట్టాలు పంపిణీ చేస్తామని, నాన్‌ అక్రిడిటేషన్‌ జర్నలిస్టులకు కూడా తర్వాత దశలో ఇస్తామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం కాబట్టి.. ఇతర ప్రాంతాలు, సమీప గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపా యాలు కల్పిస్తామని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు దశ మారిపోతోందన్నారు. ఈ నెల 29న పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. గడిచిన కొద్ది నెలల్లోనే నియోజకవర్గానికి రూ.200 కోట్ల పైచిలుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తేనే తాను ఇన్ని పనులు చేయగలిగానని, భవిష్యత్‌లో కూడా ప్రజల సహకారం ఉంటుందనే నమ్మకం తనకుందని అన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, పెబ్బేరు మునిసిపాలిటీ వైస్‌ చైర్మన్‌ కర్రె స్వామి, గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌, రీజనల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ అథారిటీ సభ్యుడు ఆవుల రమేష్‌ పాల్గొన్నారు.

మంత్రికి సన్మానం

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా: పట్టణంలోని హనుమాన్‌ టెకిడీలో ప్రతిష్ఠించిన వినాయకుడిని మంత్రి శుక్రవారం దర్శించుకుని, పూజలు చేశారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు సురేష్‌ శెట్టి మంత్రిని తన నివాసానికి ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు గురించి మంత్రితో ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు సురేష్‌ శెట్టి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T22:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising