ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

ABN, First Publish Date - 2023-08-22T23:41:58+05:30

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ సృజన అన్నారు. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.

మొక్కనాటి నీరు పోస్తున్న ఎస్పీ సృజన

- ‘హరితహారం’లో ఎస్పీ సృజన

గద్వాల క్రైం, ఆగస్టు 22 : పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ సృజన అన్నారు. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుందని చెప్పారు. దీంతో అక్కడ ఉండే వారి ఆలోచన విధానం మారుతుందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నా, ప్రాణవాయువైన ఆక్సిజన్‌ శాతం పెరగాలన్నా మొక్కలు నాటి పెంచాల్సిందేనన్నారు. ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్సీ ఎన్‌.రవి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, ఏఓవో సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising