ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

ABN, First Publish Date - 2023-09-04T22:53:17+05:30

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ బేషరతుగా పర్మినెంట్‌ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

సమ్మె శిబిరం వద్ద నిరసన తెలుపుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు

- ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 4 : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ బేషరతుగా పర్మినెంట్‌ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సోమవారం గద్వాల పట్టణంలోని రాజీవ్‌మార్గ్‌లో నిరవధిక సమ్మె ప్రారం భించారు. సమ్మె శిబిరంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులం దరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని పదేళ్ల క్రితం హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. గత 23 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కుటుంబాల నిర్వహణ భారమైనా ప్రజలకు వైద్య సేవలందించడంలో నిరంతరం శ్రమిస్తున్న స్కీం వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రూ.10లక్షల ఆరోగ్యబీమా కల్పించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించా లన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే 16 రోజుల పాటు నిరవధిక సమ్మె కొనసాగించిన ఏఎన్‌ఎంలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించినట్లు ఆంజనేయులు తెలిపారు. హామీల అమలు కోసం 15 రోజుల పాటు వేచి చూస్తామని, అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. సమ్మె శిబిరంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రంగన్న, నాయకులు కాశీం, ఆశన్న, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు హనుమంతు, నరసింహులు, హరిప్రసాద్‌, సిరాజ్‌, పరశురాం, రాజ్‌కుమార్‌ నారాయణ, గోపాల్‌, సుందర్‌రాజ్‌, సోని ఉన్నారు.

Updated Date - 2023-09-04T22:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising