కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే
ABN, First Publish Date - 2023-09-26T22:56:14+05:30
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, తెలం గాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో మంగళ వారం మహబూబ్‌నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, తెలం గాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో మంగళ వారం మహబూబ్‌నగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోనూ కేంద్రంలో మోదీ తరహా పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారని, ఇప్పుడు బిల్లు ఆమోదం పొందితే ఓబీసీ కోటా అంటున్నారని విమర్శించారు. మహిళల కోసం బీఆర్‌ఎస్ ఏం చేసిందని, మొదటి క్యాబినెట్‌లో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేరన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిం చారు. కేవలం కుటుంబం కోసమే బీఆర్‌ఎస్ పనిచేస్తే, నరేంద్రమోదీ దేశ ప్రజలందరి కోసం పనిచేస్తున్నారని తెలి పారు. తెలంగాణలో ఈనెల 1న మహబూబ్‌నగర్‌లో, 3న నిజామాబాద్‌లో మోదీ సభలు నిర్వహిస్తున్నామని తెలి పారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారంతా బీజేపీని బలపర చాలని కోరారు. కమీషన్లు, అక్రమాల కోసమే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరంగా చేపట్టారన్నారు. పాలమూరు ఎత్తిపోతలపైనా ఈప్రభుత్వానికి చిత్తశు ద్ధిలేదన్నారు. సక్రమంగా డీపీఆర్ ఇస్తే కేంద్రం ఇవ్వాల్సిన అన్ని అనుమతులు రావడంతో పాటు, అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీల నియామకాల తిరస్కరణ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా నడుచ కున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ మంత్రులు పీ.చంద్రశేఖర్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్‌కుమార్, రాష్ట్ర నాయకులు ఆచారి, నాగూరావు నామాజీ, వీరెల్లి చంద్రశేఖర్, డోకూరు పవన్‌కుమార్, రతంగ్‌పాండురెడ్డి, జిల్లాల అధ్యక్షులు వీరబ్రహ్మచారి, పగడాకుల శ్రీనివాసులు, రాజ్యవర్థన్‌రెడ్డి, సుధా కర్‌రావు, రాంచంద్రారెడ్డి, నాయకులు జలంధర్‌రెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య, సుదర్శన్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలాత్రిపు రసుందరీదేవి, పాండురంగారెడ్డి, సురేందర్‌రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-26T22:56:14+05:30 IST