ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

ABN, First Publish Date - 2023-01-03T23:00:50+05:30

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. గతనెల 8న ప్రారంభమైన పరీక్షలు 22 రోజుల పాటు సాగాయి.

లాంగ్‌ జంప్‌ చేస్తున్న మహిళా అభ్యర్థి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70.11 శాతం మంది అర్హత

పురుషులు 67.60 శాతం, మహిళలు 82.42 శాతం క్వాలిఫై

ఏప్రిల్‌లో మెయిన్స్‌ రాత పరీక్ష

మహబూబ్‌నగర్‌, జనవరి 3: ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. గతనెల 8న ప్రారంభమైన పరీక్షలు 22 రోజుల పాటు సాగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో పోలీసులు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్‌ఎఫ్‌ఐడీ విధానం ద్వారా సెన్సార్‌ల ఆధా రంగా ఈవెంట్స్‌ను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23,745 మంది అభ్యర్థులకు గాను 21,596 మంది అభ్యర్థులు పరీ క్షలకు హాజరయ్యారు. 2,198 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హాజరైన వారికి ఎత్తు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌ పరీక్షలు నిర్వహించారు. 15,143 మంది అర్హత సాధించగా వీరికి తదుపరి మెయిన్స్‌ రాతపరీక్ష కోసం హాల్‌టికెట్‌లను జారీ చేశారు. మొత్తంగా 70.11 శాతం మంది మాత్రమే ఈవెంట్స్‌లో అర్హత సాధించారు. అయితే, పురుషుల కన్నా మహిళల క్వాలిఫై శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. పురుషులు 67.60 శాతం అర్హత సాధిస్తే, మహిళలు మాత్రం 82.47 శాతం మంది అర్హత సాధిం చారు. వీరికి ఏప్రిల్‌లో మెయిన్స్‌ రాత పరీక్షలు జరగనున్నాయి. కాగా, కేటాయించిన తేదీల్లో వివిధ కారణాలచేత హాజరుకాని అభ్యర్థులు ఉన్నతాధికారుల అనుమతి పొందగా, వారందరికీ చివరి రోజు ఈవెంట్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. మంగళవారం 1,382 మంది అభ్యర్థులు హాజరుకావల్సి ఉండగా వీరిలో 1,278 మంది హాజరయ్యారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 923 మంది అర్హత సాధించారు. పరీక్షలను ముందునుంచి పరీక్షల ఛీఫ్‌ సూపరింటెండెంట్లు ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, డా.చేతనలు పర్యవేక్షించారు. నోడల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ ఎస్పీ ఏ.రాములు వ్యవహరించారు. పోలీసులు 22 రోజుల పాటు శ్రమించారు. పరీక్షల ప్రక్రియ సజావుగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-01-03T23:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising