అడగకముందే పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2023-06-10T23:18:01+05:30
సమైక్యరాష్ట్రంలో దివ్యాంగుల కష్టాలు అన్నీఇన్ని కావని, అయినప్పటికీ వారిని ఎవరినీ పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
- జిల్లాలో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 10 : సమైక్యరాష్ట్రంలో దివ్యాంగుల కష్టాలు అన్నీఇన్ని కావని, అయినప్పటికీ వారిని ఎవరినీ పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నెల నెల వచ్చే 500 రూపాయల పెన్షన్ సైతం సరిగా ఇచ్చేవారు కాదని అన్నారు. వ్యవస్థపై ఆధారపడకుండా వారంతట వారే అందరిలాగా బతకాలి అన్న సదుద్దేశం తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చి తర్వాత దివ్యాంగులకు రూ.3000 పెన్షన్ ఇచ్చారని తెలుపుతూ, ఇప్పుడు ఎవరూ అడగకముందే దాన్ని రూ. 4016కు పెంచారని మంత్రి గుర్తు చేశారు. దివ్యాంగులకు పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచినందుకు శనివారం కలెక్టర్ కార్యాలయ భవనం ఆవరణలో ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌ల చిత్రపటాలకు దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. దివ్యాంగుల భవన్ ఏర్పాటు కోసం స్థలం ఇస్తామని, అదే విధంగా దివ్యాంగుల సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అనం తరం మంత్రి దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కా ర్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కేసీ నరిసింహులు, దివ్యాంగుల సం ఘం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, దివ్యాంగుల మహిళా అధ్యక్షు రాలు యాదమ్మ, ఉపాఽధ్యక్షులు రవికుమార్, జనరల్ సెక్రెటరీ అంజ య్య, నరసింహులు, యాదయ్య, కృష్ణ, నరేందర్, శంకర్ పాల్గొన్నారు.
- భూత్పూర్ : భూత్పూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మె ల్యే ఆల చిత్రపటానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ది వ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసి పల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, నాయకులు మేకల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేష్‌కుమార్‌గౌడ్, యువత అధ్యక్షుడు గడ్డం ప్రేమ్‌కుమార్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులు పాల్గొన్నారు.
- హన్వాడ : హన్వాడలో దివ్యాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దివ్యాంగుల పెన్షన్‌ను 4016 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల రాజు, బీఆర్‌ఎస్ నాయకులు రమణారెడ్డి, మాధవులుగౌడ్, దివ్యాం గులు మంగళి వీరేష్‌కుమార్, నర్సిములు, రాజు, మైనుద్దీన్, ఖదీర్, ఆంజనే యులు, వెంకటేష్, రాములు, శ్రీనివాసులు, నర్సిములు పాల్గొన్నారు.
- అడ్డాకుల : మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేంద ర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, మండల కోఆప్షన్ ఖాజాఘోరి, కందూరు రామలింగేశ్వరాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
- జడ్చర్ల : వికలాంగుల పెన్షన్‌ను రూ.3116 నుంచి రూ.4116కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో దివ్యాంగులు శనివారం జడ్చర్లలో సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డిల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో దివ్యాంగులతో కలిసి మునిసిపల్ చైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్ సతీష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Updated Date - 2023-06-10T23:18:01+05:30 IST