ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకగూటి పక్షులే

ABN, First Publish Date - 2023-02-06T23:38:44+05:30

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ని బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక గూటి పక్షులేనని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేం ద్రప్రసాద్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి 6: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ని బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక గూటి పక్షులేనని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేం ద్రప్రసాద్‌ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో మోదీ ప్రభు త్వం ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. తన ప్రాణ స్నేహితుడైన ఆదానీ గ్రూప్‌ సంస్థలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేసిందన్నారు. దీంతో దేశంలోని 39 కోట్ల మంది ప్రజల ఎల్‌ఐసీ పెట్టు బడిదారుల మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద రూ. 33,060 కోట్ల నష్ట భారం పడిం దన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పేదలపై పెనుభారం పడిం దన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ఎన్నికలు జరిగే ప్రతిసారి వేల కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారని, దీనికోసమేనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని అన్నారు. రాష్ట్ర ప్రజలను తన మాయ మాటల గారడీతో మోసం చేస్తున్న కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళ అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, నాయకులు యాదయ్య, కదిరె రాములు, ఎండీ బాబా, రోహిత్‌, దివాకర్‌ యాదవ్‌, మన్నెంకొండ, రాగి అజయ్‌, చరణ్‌, అబ్దుల్లా, డి వెంకటేష్‌, జాన్‌, వీణాచారి, నరేందర్‌రెడ్డి, నాగార్జున, పురుషోత్తం, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising