ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
ABN, First Publish Date - 2023-06-07T23:34:50+05:30
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరు గుతోందని ఎంఈవో వెంకటయ్య పేర్కొన్నారు.
మాగనూరు, జూన్ 7 : ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరు గుతోందని ఎంఈవో వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మందిపల్లి, వర్కూరు, నేరేడుగం, కొత్తపల్లి, కొల్పూరు గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బడీడు పిల్లలతో పాటు ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులను, ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఉపాధ్యాయులు శివరాజు, లక్ష్మారెడ్డి, తిమ్మన్న, నరేందర్, సర్పంచు రాజు, వార్డు మెంబర్ ఆనంద్, సీఆర్పీలు ఎల్లాగౌడ్, కృష్ణయ్య పాల్గొన్నారు.
దామరగిద్ద : ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే మెరుగైన విద్యతో పాటు విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ప్రధానోపాధ్యా యుడు సూర్మి రమేష్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని లింగా రెడ్డిపల్లి, బాపన్‌పల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను బడి లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, ప్రతీ విద్యార్థికి ఒక జత స్కూల్ డ్రెస్ అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మల్లప్ప, సీఆర్పీ ఉషనప్ప, శ్రీనివాస్‌రెడ్డి, శంబులింగం ఉన్నారు.
Updated Date - 2023-06-07T23:34:50+05:30 IST