ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబోయ్‌ పాములు

ABN, First Publish Date - 2023-08-03T00:14:37+05:30

వర్షాకాలం వచ్చిందంటే పా ముల బెడద అధికంగా ఉంటుంది.

పామును పట్టుకున్న వ్యక్తి (ఫైల్‌)

- నాటు వైద్యంతో ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు

- రెండు నెలల్లోనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 53 కేసులు

అచ్చంపేట, ఆగస్టు 2: వర్షాకాలం వచ్చిందంటే పా ముల బెడద అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌లో రైతులు, పశువుల కాపరులు అ ప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లాల్సి వస్తే టార్చిలైట్‌ను తప్పనిసరిగా వెంట తీసు కెళ్లాలి. రైతులు మోకాళ్ల వరకు ఉన్న బూట్లు, టార్చిలైట్‌, కర్ర స హాయంతో పొలాల్లోకి వెళ్లాలి. పాము కరిస్తే గ్రామీణ ప్రాంత ప్ర జలు నాటు వైద్యం చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటు న్నారు. అలా కాకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసు కెళ్లా లని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుటికే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చం పేట ప్రభుత్వం ఆ సుపత్రిలో జూన్‌ మాసంలో 21, జూలైలో 3 2కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అన్ని పాముల్లో విషం ఉండదు..

మన ప్రాంతంలో సంచరించే అన్ని పాములు విషపూరితమైనవి కాదు. అందులో కొన్ని మాత్రమే విషపూరితమైన పాములు ఉ న్నాయి. విష సర్పాలలో రెండు రకాలు ఉన్నాయి... న్యూరోటాక్సిక్‌ రకానికి చెందిన వాటిలో నాగుపాము, కట్లపాము. రెండో రకం హిమోటాక్సిక్‌ రకానికి చెందిన వాటిలో రక్త పింజర. న్యూరోటాక్సిక్‌ రకానికి చెందని పాములు కాటేస్తే నోటి ద్వారా నురగ వచ్చి శ్వాస ఆడక మృతిచెందే ప్రమాదం ఉంది. మొదటి రకానికి చెందిన పాముల్లో కట్లపాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉం చుకొని వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము కాటేసిన సుమారు 15, 20 నిమిషాల్లో శరీరంలోకి విషం ప్రవేశిస్తుంది. రెండో రకానికి చెందిన పాము రక్త పింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం ఎక్కుతుంది. అలాగే జెర్రిపోతు, నీరుకట్ట, కాటేసినా దాని విషం ఉండదు. అయితే కాటు వేసిన చోట చికిత్స చేయించాలి. పాము కాటుకు గురై వ్యక్తులు ఆందోళన చెందకుండా వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. వైద్యుడికి ఏ పాము కాటేసిందో స్పష్టం గా చెబితే దానికి సంబందించిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

కనిపించే లక్షణాలు..

విషపూరితమైన పాము కాటువేస్తే శరీరమంతా నీలం రంగులోకి మారుతుంది. రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు. పాము కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. నోటినుంచి తెల్లని నురగ వస్తుంది. శరీ ర మంతా చేమటలు పట్టి కో మాలోకి వెళ్తారు. గుండె రెట్టింపు గా కొట్టుకుంటుంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురై వ్యక్తులను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. అన్ని ప్రభుత్వం ఆసుపత్రులలో పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. రైతులు రాత్రిపూట పొలాల వద్దకు వెళితే చేతిలో కర్ర, టార్చిలైట్‌ సహాయంతో వెళ్లాలి.

- బిక్కు నాయక్‌, ఉప్పునుంతల పీహెచ్‌సీ వైద్యుడు

Updated Date - 2023-08-03T00:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising