ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పాలమూరుకు కేటీఆర్‌, మల్లారెడ్డి రాక

ABN, First Publish Date - 2023-06-07T23:11:17+05:30

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కార్మికశాఖ మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి, ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కార్మికశాఖ మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి, ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌, జడ్చర్లల్లో జరిగే బహిరంగ సభల్లో కేటీఆర్‌ మాట్లాడుతారు. సహచర మంత్రులతో కలిసి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా భూత్పూర్‌ చేరుకునే మంత్రి కేటీఆర్‌ అక్కడ మునిసిపల్‌ పార్కును ప్రారంభిస్తారు. అనంతరం మూసాపేట మండలం వేముల వద్ద ప్రైవేట్‌ కర్మాగారంలో నూతన ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ ఐటీఐ కాలేజీకి 11 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయతలపెట్టిన గ్రామీణ సూక్ష్మ నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇక్కడ జరిగే బహిరంగ సభలో మా ట్లాడతారు. అనంతరం మంత్రులు రోడ్డు మార్గంలో రెండు గంటలకు జడ్చర్లకు వెళ్తారు. అక్కడ నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగే సభలో మాట్లాడుతారు. సభ అనంతరం నాలుగు గంటలకు జడ్చర్ల నుంచి హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ వెళ్తారు.

Updated Date - 2023-06-07T23:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising