ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
ABN, First Publish Date - 2023-09-26T22:55:41+05:30
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.
- అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
- చాకలి ఐలమ్మకు ఘన నివాళి
నారాయణపేట టౌన్, సెప్టెంబరు 26 : ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మంగళవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె సాహసాలను కొనియాడారు. ఆర్డీవో రాంచందర్, బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, ఏవు నరసింహరావు, రజక సంఘం నాయకులు చంద్రశేఖర్, రఘు పాల్గొన్నారు. నారాయణపేటలో ద్విచక్ర వాహనాలతో రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి, సత్యనారాయణ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి సాయిబన్న, సీపీఎం జిల్లా నాయకుడు గోపాల్ మాట్లాడారు. రజక సంఘంలో ఉన్నత ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను సన్మానించారు. రజక సంఘం సభ్యులు ఎల్లప్ప, వెంకటప్ప, నరసింహులు, తిరుపతయ్య, జగన్నాథం, లలితమ్మ, రాములు, బాలు, సురేష్, మహిపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-26T22:55:41+05:30 IST