ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గొప్ప పరిపాలనాదక్షుడు

ABN, First Publish Date - 2023-08-22T23:51:27+05:30

గొప్ప పరిపాలనాదక్షుడు రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పుట్టడం జిల్లా వాసులకు గర్వకారణమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాసగౌడ్‌ అన్నారు.

రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి విగ్రహానికి ఎంపీతో కలిసి పూలమాల వేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డికి ఘన నివాళి

- జయంతి వేడుకల్లో ఆబ్కారీశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, ఆగస్టు 22 : గొప్ప పరిపాలనాదక్షుడు రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పుట్టడం జిల్లా వాసులకు గర్వకారణమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాసగౌడ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ బెల్టు ఏరియాలో రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి 154వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని, రెడ్డి హాస్టల్‌ ద్వారా అనేక మం దిని ప్రయోజకులుగా చేసిన ఘనత ఆయనదన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పి.గిరిధర్‌రెడ్డి, మల్లు నరసింహారెడ్డి, ఇంద్రసే నారెడ్డి, ధనుంజయరెడ్డి, రాఘవరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising